తెలుగు బుల్లితెరపై సంచలనాలు సృష్టిస్తూ నెంబర్ వన్ రియాలిటీ షోగా వెలుగొందుతోంది బిగ్ బాస్. ఇలా ఇప్పటికే ఈ షో ఎన్నో సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇక, దీని వల్ల చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు. తద్వారా వరుసగా అవకాశాలను దక్కించుకుంటూ హవాను చూపిస్తున్నారు. అలాంటి వారిలో సొట్టబుగ్గల సుందరి దివి వాధ్యా ఒకరు.గతంలోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా బిగ్ బాస్ తర్వాత ఈమె రేంజ్ మరింత పెరిగింది. దీంతో సినిమాల మీద సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా యమ హడావిడి చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ తెగ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే దివి తాజాగా కొన్ని హాట్ పిక్స్ వదిలింది.దివి అందాలకు కుర్రాళ్ళు ఫిదా అవుతున్నారు.ఈ క్రమంలోనే దివి వెకేషన్ కు సంబందించిన ఫోటోలను పంచుకుంది. వెకేషన్ లో ప్రకృతిని కూడా తన వలలో వేసుకునేలా ఫోటోలు షేర్ చేస్తోంది ఈ చిన్నది. తాజాగా ఈ ముద్దుగుమ్మ పంచుకున్న ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందే దివి వాధ్యా మోడల్‌గా సత్తా చాటింది. ఈ క్రమంలోనే 'లెట్స్ గో' అనే సినిమాతో నటిగా పరిచయమైంది. ఆ తర్వాత 'సీన్ నెంబర్ 72' సహా ఎన్నో చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. ఈ క్రమంలోనే మహేశ్ బాబు చిత్రం 'మహర్షి' కీలక పాత్రను పోషించింది. అయితే, ఇలా ఎన్నో చిత్రాల్లో మెరిసినా దివి మాత్రం ఫేమస్ కాలేకపోయింది.సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత దివి వాధ్యా హీరోయిన్‌గా, సపోర్టింగ్ ఆర్టిస్టుగా చాలా సినిమాలు చేసినా గుర్తింపు మాత్రం రాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమెకు బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా అవకాశం దక్కింది. ఇందులోకి సాదాసీదాగానే ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు అందంతో పాటు ఆటతీరుతో ఆకట్టుకుంది. అంతేకాదు, నిజాయితీగా ఉంటూ పాపులర్ అయిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: