మీనాక్షి చౌదరి.. ఈ పేరుకి ప్రత్యేకంగా పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు . సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది . అఫ్కోర్స్ మీనాక్షి చౌదరి కెరియర్ ఎలా ప్రారంభమైందో అందరికీ తెలిసిందే.  తెలుగు ఇండస్ట్రీలో పెద్దగా ఫస్ట్ అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అయితే మెల్లిమెల్లిగా తన అందంతో పెద్దపెద్ద స్టార్ హీరోస్ ని కూడా మెల్ట్ చేస్తూ అవకాశాలు దక్కించుకోవడం ప్రారంభించింది . మరీ ముఖ్యంగా "గుంటూరు కారం" సినిమా ఆమె లైఫ్ టర్న్ చేసిందని చెప్పాలి .


సినిమా ఫ్లాప్ అయినా కూడా మీనాక్షి చౌదరి పేరు మారుమ్రోగిపోయింది అంటే కారణం ఆమె లుక్స్ . లంగా వోణీలో ఈ సినిమాలో చాలా ట్రెడిషనల్ పాత్రలో మెరిసింది.  కాగా మీనాక్షి చౌదరి కోలీవుడ్ లోనూ దున్నేస్తుంది . ఆమె చేతుల్లో ఇప్పుడు నాలుగు బడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి . తెలుగులో కూడా మూడు సినిమాల్లో నటిస్తుంది . వీటిలో ఏ ఒక్క సినిమా హిట్ అయిన సరే మరో ఐదు ఏళ్ళు మీనాక్షి చౌదరికి ఇండస్ట్రీలో డోకా లేదని చెప్పాలి .



సరిగ్గా ఇటువంటి సమయంలోనే మీనాక్షి చౌదరి పెళ్లి వార్త ఇంటర్నెట్ ని షేక్ చేసి పడేస్తుంది . మీనాక్షి చౌదరి కోలీవుడ్ స్టార్ సీనియర్ హీరో కొడుకుతో ప్రేమాయణం నడుపుతుంది అని ఓ వార్త తెగ హల్ చల్ చేస్తుంది . అంతేకాదు ఇప్పటికే మీనాక్షి చౌదరి కోలీవుడ్ లో టాప్ బ్యూటీగా స్థానం సంపాదించుకుంది.  ఇలాంటి మూమెంట్లోనే స్టార్ హీరో ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది అన్న న్యూస్ బయటకు రావడంతో ఆమె పేరు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది . అంతేకాదు మీనాక్షి చౌదరి కి ఇంకా ఆఫర్స్ రావడానికి కూడా ఇది బాగా తోడ్పడుతుంది అంటున్నారు ఫాన్స్ . అంతేకాదు ఫ్యాన్స్ మీనాక్షి చౌదరికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. అయితే మీనాక్షి చౌదరి తన లవ్ మ్యాటర్ ని మాత్రం సీక్రెట్ గా దాచినట్లు తెలుస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: