టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ కొన్ని సంవత్సరాల క్రితం ఎక్కువ శాతం ఏ దర్శకుడికి మంచి విజయాలు ఉంటే ఆదర్శకుడితో సినిమా చేయడానికి ఆసక్తి చూపించేవాడు. అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ కి విజయాల కంటే ఎక్కువ సార్లు అపజయాలే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. దానితో ఆయన తన రూటు మార్చాడు. ఎక్కువ శాతం విజయాలు ఉన్న దర్శకులతో సినిమాలు చేయాలి అని కాకుండా ఎవరిలో అద్భుతమైన టాలెంట్ ఉంటుందో వారితో సినిమాలు చేయాలి అని ఆలోచనకు వచ్చాడు. దానితో దర్శకుడికి ఫ్లాప్ లు ఉన్న ఏ మాత్రం పట్టించుకోకుండా వారితో సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

అందులో భాగంగా టెంపర్ మూవీ కంటే ముందు పూరి జగన్నాథ్ కి వరస ఫ్లాప్లు ఉన్నాయి. అయిన ఆయనతో చేసి అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు. అలాగే ఈ మధ్య కాలంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లాపులు ఉన్న దర్శకులతోనే సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ విజయాలను అందుకుంటున్నాడు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ "దేవర పార్ట్ 1" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కంటే ముందు కొరటాల "ఆచార్య" మూవీ తో భారీ ఫ్లాప్ ను అందుకున్నాడు. అలాంటి ఫ్లాప్ తర్వాత కొరటాలతో సినిమా చేసి అద్భుతమైన విజయాన్ని తారక్ సొంతం చేసుకున్నాడు.

ఇలా ఫ్లాప్లు ఉన్న దర్శకులతో సినిమాలు చేస్తూ బ్లాక్ బాస్టర్లను అందుకుంటున్న తారక్ ప్రస్తుతం వార్ 2 లో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడు. ఇక ప్రశాంత్ మాత్రం వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. మరి వరుస విజయాలతో ఉన్న ప్రశాంత్ దర్శకత్వంలో తన తదుపరి మూవీని తారక్ చేయనున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలియాలి అంటే ఇంకా చాలా కాలం వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: