తెలుగు ఇండస్ట్రీలో నటి ప్రగతి గురించి చెప్పాల్సిన పని లేదు.క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఇమే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటిస్తూ ఉన్నది. అప్పట్లో హీరోయిన్గా నటించిన ఈమె అతి తక్కువ సమయంలోనే హీరోయిన్ గా ఫేడ్  అవుట్ అయింది. దీంతో ఇమే పెళ్లి జరగడంతో హీరోయిన్గా నటించలేదట.అయితే ఆ తర్వాత మళ్లీ కొన్ని సంవత్సరాలకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని మొదలుపెట్టి బాగానే సక్సెస్ అయ్యింది. ప్రగతి ఇలా ఎన్నో చిత్రాలలో అత్తగా అమ్మగా నటించిన ఈమె సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గానే ఉంటుంది.


ముఖ్యంగా వెయిట్ లిఫ్టింగ్ కి సంబంధించి జిమ్ వర్కౌట్ లకు సంబంధించి పలు విషయాలను తెలియజేస్తూ ఉంటుంది ప్రగతి. తన భర్త నుంచి దూరంగా ఉన్న ప్రగతి అప్పుడప్పుడు కుటుంబ విషయాలను కూడా పంచుకుంటూ ఉంటుంది తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. సినిమా షూటింగ్ సెట్లో ఒక నటుడు తనతో ఒకరోజు చాలా అసభ్యకరంగా ప్రవర్తించారని అతడు చేసిన పనికి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.


అసలు ఆ సమయంలో తనకు ఏం చేయాలో అసలు అర్థం కాక సైలెంట్ అయిపోయాను.. మొదట్లో ఆ నటుడు చాలా పద్ధతిగా ఉన్నారని కానీ ఎందుకు ఆరోజు అలా చేశారు ఇప్పటికీ అర్థం కాలేదని ఆ విషయంలో తాను ఎన్నోసార్లు బాధపడ్డారని తెలిపింది ప్రగతి. ఆరోజు షూటింగ్ చేయకుండా ఇంటికి వెళ్లిపోయానని ఆ తర్వాత అతనితో మాట్లాడాలని నిర్ణయించుకున్నాను.. అలా ఆయనతో వెళ్లి తనతో ఎందుకు అలా ప్రవర్తించావని అడగగా ఆయన తలదించుకున్నారని.. ఆరోజు తొందరపడి ఏదైనా నిర్ణయం తీసుకుంటే మరొక లాగా పరిస్థితి ఉండేదని.. అతడికి వార్నింగ్ ఇవ్వక దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయా తెలిపింది ప్రగతి.. కానీ ఆ తర్వాత ఆ నటుడు తనమీద లేనిపోని  రూమర్స్ క్రియేట్ చేసి తనని బ్యాడ్ గా చేశారని ఎమోషనల్ గా మాట్లాడింది. కానీ ఆ నటుడి పేరు మాత్రం చెప్పలేదు ప్రగతి.

మరింత సమాచారం తెలుసుకోండి: