టాలీవుడ్, కోలీవుడ్లో లో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న త్రిష తన నటనతో అందంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నది.. ఏలాంటి విషయం పైన  సరే మొహమాటం లేకుండా చూపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా కుర్ర హీరోయిన్లకు దీటుగా తన అందంతో సినిమా అవకాశాలను సంపాదించుకుంటోంది. దక్షిణాది సీని ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలకు పైగా సినిమా అవకాశాలను అందుకుంటోంది త్రిష. ఎన్నో భాషలలో కూడా నటించి స్టార్ హీరోలకు జోడిగా కూడా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది. అంతే కాకుండా పలు రకాల  బ్రాండ్లను ప్రమోట్ చేస్తూ ఉంటుంది.


బాలీవుడ్ లో కూడా ఖట్టా మిట్టా అనే హిందీ సినిమా ద్వారా బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హీరోగా అక్షయ్ కుమార్ నటించారు. ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న త్రిషకు మాత్రం ఇష్టమైన హీరోయిన్ కూడ ఉన్నదట. ఒకానొక సందర్భంలో హీరోయిన్ అనుష్క, నిత్య మీనన్ ,సాయి పల్లవి అంటే తనకు చాలా ఇష్టమని తెలియజేసింది. ఈ విషయం విన్న అభిమానుల సైతం ఆశ్చర్యపోయారు. త్రిష సినీ కెరియర్ విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంభర చిత్రంలో చిరంజీవికి జోడిగా నటిస్తున్నది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.


డైరెక్టర్ మణిరత్నం, హీరో కమలహాసన్ నటిస్తున్న చిత్రం థగ్గ్ లైఫ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నది త్రిష. అయితే అభిమానులు మాత్రం ఈ అమ్మడి వివాహ విషయంపై ఎప్పుడు గుడ్ న్యూస్ చెబుతుందా అనే విధంగా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. అయితే గతంలో ఒకసారి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత వివాహాన్ని క్యాన్సిల్ చేసుకున్న త్రిష ఆ తర్వాత మళ్లీ వివాహ విషయం పైన ఎలాంటి విషయాన్ని చెప్పలేదు. అప్పుడప్పుడు పలు రకాల రూమర్స్ వినిపిస్తూ ఉన్నప్పటికీ కూడా వాటిపైన ఎప్పుడు స్పందించలేదు త్రిష. మరి త్వరలోనే ఏదైనా గుడ్ న్యూస్ చెబుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: