ఇక్కడ నిజానికి ప్రతి సంక్రాంతికి మెగా - నందమూరి హీరోల మధ్య పోటీ ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.. ప్రతి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి , నందమూరి బాలకృష్ణ తమ సినిమాలతో సంక్రాంతి బరిలో నిలిచి పండుగను రసవత్తరంగా మార్చారు. అయితే ఈసారి మాత్రం చిరంజీవి స్థానంలో ఆయన కొడుకు రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజెర్ బాలయ్య మూవీ తో యుద్ధానికి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే 'గేమ్ చేంజర్', బాలయ్య సినిమాకి పోటీ ఉన్న నేపథ్యంలో వీటిలో ఏది హిట్ అవుతుంది? దేనికి ఎక్కువ కలెక్షన్లు వస్తాయి? ఏ సినిమా ఎక్కువ బిజినెస్ జరుగుతుందని అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఈ క్రమంలోని ఓ ఏరియా బిజినెస్ విషయంలో రామ్ చరణ్ కంటే బాలయ్యదే పే చెయ్ అన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో సెన్సేషన్ గా మారింది.
ఇక మన తెలుగు రాష్ట్రాల్లో సీడెడ్ ఏరియాకు ఎంతో ప్రత్యేకత ఉంది. అయితే ఇక్కడ మన తెలుగులో కొందరు హీరోలకు మాత్రమే గట్టి ప్రభావం చూపిస్తారు. అందులో నటసింహం ఒకరు . ఇప్పుడు ఆయన నటించిన సినిమాలకు ఇక్కడ భారీ రెస్పాన్స్ కూడా అందుతుంది. అందుకే ఇప్పుడు తన 109వ సినిమాకు 19 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. బాలకృష్ణ కెరియర్ లోని అత్యధిక హైయెస్ట్ బిజినెస్ అని సమాచారం. అయితే రామ్ చరణ్ కూడా సీడెడ్ లో మంచి మార్కెట్ ఉంది కానీ గేమ్ ఛేంజర్కు ఇక్కడ కేవలం 15 కోట్ల బిజినెస్ మాత్రమే జరిగిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా బాలయ్య, రామ్ చరణ్ కు గడ్డి రాడ్ దింపాడు .