ఫైనల్లీ బన్నీ ఇవన్ని నుంచి సక్సెస్ఫుల్గా తప్పించుకున్నాడు . అయితే హీరోయిన్ సాయి పల్లవి మాత్రం అడ్డంగా బుక్ అయిపోయింది. కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న శివ కార్తికేయన్ తో సాయి పల్లవి తాజాగా నటించిన సినిమా "అమరన్". బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కింది. ఎంతో ఇష్టంగా ఈ సినిమాను డైరెక్ట్ చేశారు రాజ్ కుమార్ పెరియ స్వామి. అక్టోబర్ 31వ తేదీ ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో ప్రమోషన్స్ లో చురుగ్గా పాల్గొంటున్నారు చిత్ర బృందం. ఇది ఇలా ఉండగా సాయి పల్లవి గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటల తాలూకా వీడియో మరోసారి వైరల్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు .
గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.." సమస్య పరిష్కారానికి హింస కరెక్ట్ కానేకాదు.. ఎవరు ఏమనుకున్నా సరే నా దృష్టిలో ఇదే కరెక్ట్ . ఒకప్పుడు చట్టం లేకపోవడంతో యుద్ధాలు చేసేవారు కానీ ఇప్పుడు అలా కాదు కదా అసలు యుద్ధం అవసరమే లేదు . ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇండియన్ ఆర్మీ ని ఇండియన్ వాళ్లు టెర్రరిస్టులుగా భావిస్తూ ఉంటారు" అంటూ ఆమె చెప్పుకు వచ్చారు. అప్పట్లో ఈ భామ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాయి. కొంతమంది సాయి పల్లవిని బాగా టార్గెట్ చేసి ట్రోల్ చేశారు .
పాకిస్తాన్ వాళ్ళతో మనం మాట్లాడాలా..? ఏం మాట్లాడుతున్నావ్..? అసలు నీకు బుద్ధుందా..? వాళ్ళు చేసిన పనులు ఎలాంటి ఓ నీకు తెలియదా ..? అసలు నువ్వు ఇండియన్ వేనా ..? అంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు . అంతేకాదు ఇప్పుడు మరొకసారి "ఇండియన్ ఆర్మీ అధికారి కధతో తెరకెక్కిన మూవీ లో నటించే అర్హత ఆమెకు లేనేలేదు" అంటూ తిట్టిపోస్తున్నారు . ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాయి పల్లవి పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. కాగా అమరన్ సినిమాలో సాయి పల్లవి ఆర్మీ అధికారి భార్యగా నటిస్తుంది . రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్ అభిమానులను బాగా ఆకట్టుకుంటుంది..!