సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన మహేష్ అనతి కాలంలోనే ప్రేక్షకుల మన్ననలు పొందారు.. బాల నటుడుగా మహేష్ అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన రాజకుమారుడు సినిమాతో మహేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. మొదటి సినిమాతోనే హీరోగా తానేంటో నిరూపించుకున్నాడు మహేష్.. మహేష్ బాబు కెరీర్ లో టర్నింగ్ పాయింట్ మురారి మూవీ.. ఈ సినిమా మహేష్ కెరీర్ మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. తన అద్భుతమైన యాక్టింగ్ తో మహేష్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.వరుస సూపర్ హిట్స్ అందుకొని మహేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా తనకంటూ వైవిధ్యమైన గుర్తింపును సంపాదించుకున్నాడు..ప్రస్తుతం మహేష్ రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 

ఇక ఈ క్రమంలోనే రాజమౌళికి మహేష్ బాబు సినిమాల్లో బాగా నచ్చిన సినిమా ఏంటి అంటూ ఓ న్యూస్ తెగ వైరల్ అవుతుంది.అయితే రాజమౌళికి మహేష్ బాబు చేసిన సినిమాల్లో ఒక్కడు, పోకిరి సినిమాలు అంటే ఎంతో ఇష్టమని సమాచారం.ఈ రెండు సినిమాల్లో మహేష్ బాబు ఎంతో కొత్తగా కనిపించడమే కాకుండా తనను తాను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేసుకున్నాడు అంటూ రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం…ఏది ఏమైనా మహేష్ ప్రతి సినిమాలో కొత్తగా కనిపిస్తూ తనని తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న పాన్ వరల్డ్ సినిమా కోసమే మహేష్ బాబు తీవ్రంగా కష్టపడుతున్నాడు..అయితే రాజమౌళి ఇప్పుడు ఏఐ టెక్నాలజీ నేర్చుకోవడంలో బిజీగా ఉండడం వల్ల ఆయన ఈ సినిమాని డిలే చేస్తూ వస్తున్నట్లు సమాచారం.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బ్లాస్టింగ్ అప్డేట్ రానున్నట్లు సమాచారం…మహేష్ సినిమా కోసం ఇప్పటికే కథ సిద్ధంగా ఉండగా రాజమౌళి గ్రౌండ్ వర్క్ మొత్తం పూర్తి చేసే పనిలో వున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: