ముఖ్యంగా ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని.. భవిష్యత్తులో కూడా చేసుకుంటానో లేదో తెలియదు అని కూడా అన్నారు. తన మొదటి వివాహం వల్ల నాకు ఎలాంటి రిగ్రెట్ లేదు .. నిజమే నేను కీర్తి రెడ్డి విడిపోయాం ఆమె ఫ్యామిలీ ఇప్పటికీ నన్ను వాళ్ళ కుటుంబ సభ్యుడిగానే చూస్తూ ఉంటారు. అలాగే వారి కుటుంబం నాతో ఎంతో ఆప్యాయంగా ఉంటుంది. ఇక కీర్తి రెడ్డి కూడా నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఉంటారు. తాత నాగేశ్వరావు గారు మరణించినప్పుడు వచ్చి నన్ను కలిసి కూడా వెళ్లారు.. ఆమెకి మంచి ఫ్యామిలీ దొరికినందుకు నేను ఎంతో హ్యాపీగా ఉన్నాను.
మాకు పెళ్లయిన సమయంలో మా ఇద్దరికీ సరైన మెచ్యూరిటీ లేదు.. అందుకే మేము విడిపోవడానికి ఇది కూడా కారణమని సుమంత్ చెప్పుకొచ్చాడు. ఇక మా జీవితం ఒకరకంగా సినిమా స్టోరీ లా నడిచిందని సుమంత్ అన్నారు. మ్యారేజ్ వ్యవస్థపై నమ్మకం ఉంది కానీ.. అది కొంత మందికి పనిచేస్తుంది .. కొంతమందికి పనిచేయదు అని సుమంత్ అన్నారు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా ఆ హ్యాపీగా ఉన్నారు. కొంతమంది పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నారు. అది మైండ్ సెట్ ని బట్టి ఆధారపడి ఉంటుంది అని సుమంత్ తెలిపారు .