యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య జీవితం ఇప్పుడు నెట్టింట చ‌ర్చ‌నీయాంశంగా మారింది. స‌మంత‌ని ప్రేమించి పెళ్లి చేసుకొని మూడేళ్ల త‌ర్వాత విడాకులు ఇవ్వ‌డంతో ఇప్ప‌టికీ వారి విడాకుల గురించి ముచ్చ‌టించుకుంటూనే ఉన్నారు. అయితే స‌మంత నుండి విడిపోయాక చైతూ మళ్లీ ప్రేమలో పడ్డారు. అది ఎవ‌రితోనో కాదు అందాల భామ‌శోభితా ధూళిపాళత‌తో.ఆగ‌స్ట్ 8న ఆమెతో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు… అయితే ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత అంద‌రు కూడా శోభిత గురించి తెగ సెర్చ్ చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆమె ఎవ‌రు, ఆమె కుటుంబ నేప‌థ్యం ఏంటి అంటూ అనేక ఆరాలు తీస్తున్నారు. ఈ క్ర‌మంలో స‌మంత అనే చెల్లెలు శోభిత‌కి ఉంద‌ని తెలిసింది.ఈ నేపథ్యంలో నే హల్దీ వేడుకలకు సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. శోభిత తన బంధుమిత్రులతో కలిసి డ్యాన్స్‌లు చేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే వీటిలో పెళ్లికూతురు గెటప్‌లో శోభితకి బదులుగా మరో యువతి కనిపిస్తున్నారు. ఆవిడ ఎవరో కాదు స్వయానా శోభిత చెల్లెలు సమంత. వృత్తిరీత్యా డాక్టర్ అయిన సమంత .. సాహిల్ అనే వ్యక్తిని రెండేళ్ల క్రితం పెళ్లాడింది. తాజాగా తన పెళ్లినాటి సంగీత్, హల్దీ వేడుకల ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అసలే శోభిత - నాగచైతన్యలు తమ పెళ్లి గురించి ఎలాంటి షాకిస్తారోనని జనం వెయిట్ చేస్తున్న వేళ సమంత తన పెళ్లి ఫోటోలు ఈ టైమ్‌లో షేర్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.కొద్ది రోజుల క్రితం ఆమె కూడా ప్రేమ పెళ్లి చేసుకుంది. అయితే నాగ చైత‌న్య మాజీ భార్య పేరు కూడా స‌మంత కావ‌డంతో శోభిత చెల్లెలు స‌మంత కూడా ఇప్పుడు సెంట్రాఫ్ అట్రాక్ష‌న్ గా మారింది. ఇటీవ‌ల శోభిత చెల్లి స‌మంత త‌న ఇన్‌స్టాగ్రాములో నిశ్చితార్థం ఫొటోలు పోస్ట్ చేసి 2022 నుంచి ఎప్పటికి.అని పోస్ట్ చేసింది.దీంతో వీళ్ళిద్దరూ 2022 నుంచి లవ్ లో ఉన్నారు అని డైరెక్ట్ గానే చెప్పేసింది. ఇక సమంత కూడా అచ్చం శోభిత లాగే ఉంది.ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం శోభితా ధూళిపాళ ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. దీనికి సంబంధించిన ఫోటోలను ఆమె స్వయంగా షేర్ చేయడంతో మరోసారి అంతా షాకయ్యారు.పెళ్లి కూడా ఇలాగే చేసుకుని ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టి సర్‌ప్రైజ్ చేస్తారా అంటూ వారు ఆన్‌లైన్‌లో కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: