బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌-2024 హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది.ఈ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి కేటీఆర్..ఇటీవల క్యాన్సర్ బారి నుంచి కోలుకున్న సీనియర్ నటి గౌతమి పక్కన కూర్చోవడానికి నిరాకరించారు. అందుకు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.దీంతో పలువురు కేటీఆర్‌ను నెట్టింట విమర్శిస్తున్నారు. అయితే, అందుకు గల కారణాలపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది. సమ్మిట్ జరిగే టైంలో గౌతమికి హాయ్ చెప్పి.. షేకండ్ ఇచ్చిన కేటీఆర్ గౌతమి పక్కన కూర్చోవడానికి నిరాకరించి పక్కనే ఉన్న ప్రకాశ్ రాజ్ పక్కన కూర్చున్నారు. పక్కనే కూర్చోవాలని గౌతమి ఆఫర్ చేసినా.. తాను పబ్లిక్ మీటింగ్ వెళ్లి వచ్చానని.. మీకు ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని చెప్పి కేటీఆర్ దూరంగా కూర్చున్నారని బీఆర్ఎస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది.దీంతో కేటీఆర్ చేసిన పనిని అందరూ సమర్థిస్తున్నారు.ఇదిలావుండగా అంతకు ముందు ప్రకాష్‌ని హగ్ చేసుకున్న కేటీఆర్ "యూ ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్.. కీప్ ఫైటింగ్" అన్నారు. తర్వాత ఆయన గౌతమిని పలకరించారు. గౌతమితో కేటీఆర్ మాట్లాడుతూ.. నేను మీ పక్కన కూర్చునే బదులు హ్యాండ్సమ్ మాన్ కూర్చుంటేనే బాగుంటుందని ప్రకాష్ రాజ్‌కి పరోక్షంగా కాంప్లిమెంట్ ఇచ్చారు. దీంతో ప్రకాష్ రాజ్ అమ్యూజ్ అయ్యారు.ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కేటీఆర్‌పై నెటిజన్లు ప్రశంసలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక మంచి లీడర్ లక్షణం అని కేటీఆర్‌ను కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కేటీఆర్‌కు అంత అహంకారం ఎందుకని మరికొంత మంది విమర్శిస్తున్నారు. అదేవిధంగా రామన్న మైక్రోబయాలజిస్ట్ అనుకుంటా అని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు. కాగా, ఇదే ఈవెంట్‌లో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, కేటీఆర్ ఆప్యాయంగా కలుసుకోని మాట్లాడుకోవడం వైరల్‌గా మారింది. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు గులాబీ నేత విషెస్ చెప్పారు. అనుకోకుండా కలుసుకున్నాము.చాలా రోజుల తర్వాత మాట్లాడుకున్నామని శనివారం కేటీఆర్ తన  ఎక్స్ వేదికగా వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: