బాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్లలో రవీనా టాండన్ కూడా ఒకరు. తన కెరీర్ లో ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించిన ఇమే 50 సంవత్సరాల వయసులో కూడా  హీరోయిన్స్ కు దీటుగా అందాన్ని మెయింటైన్ చేస్తూ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది. రవినా 1974 అక్టోబర్ 26న జన్మించింది. ఇమే మొదటిసారి సల్మాన్ ఖాన్ తో 1991లో పత్తర్ కే పూల్ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.తన మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ అందుకుంది. రవీనా టాండన్ తన తల్లిదండ్రుల పేర్లను తన పేరులో జతచేసుకున్నదట.


ఆ తర్వాత ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించిన రవీనా టాండన్ 2004లో అనిల్ నీ వివాహం చేసుకున్నది. ఉపేంద్ర తో కలిసి నటించిన సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రవీనా ఆ తర్వాత దక్షిణాది చిత్రాలలో కూడా నటించింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన కే జి ఎఫ్-2 సినిమాలో కూడా నటించి మరింత పాపులారిటీ అందుకుంది. రవీనా టాండన్ 21 ఏళ్ల వయసులోనే ఇద్దరు చిన్నారులను దత్తత తీసుకొని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. వాస్తవానికి రవీనా, అజయ్ దేవగన్ ఇద్దరు కూడా క్లాస్మేట్స్ అట వీరిద్దరూ కలిసి ఒకే కాలేజీలోనే చదువుకున్నారట.


కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే అక్షయ్ కుమార్ రవినా ప్రేమలో పడ్డారని సమాచారం. వీరిద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిందట. అయితే కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారని సమాచారం. అయితే అందుకు గల కారణం ఏంటని విషయం తెలియదు కానీ విడిపోయారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉంటాయి.రవీనా టాండన్ దత్తత తీసుకున్న కూతురికి కూడా ఇటీవలే ఒక మగ బిడ్డ కూడా జన్మించారు. కే జి ఎఫ్-2 సినిమా తర్వాత  భారీ క్రేజ్ ను సంపాదించుకున్న ఈమె తన కూతుర్ని కూడా ఇండస్ట్రీలో పరిచయం చేసేలా ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: