ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి చాలా రోజుల తర్వాత వచ్చిన చిత్రం దేవర. కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్లో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో దేవర సినిమా మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రను పోషించాడు. పలువురు నటిమనులు కీలక పాత్రలను పోషించారు.


సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27వ తేదీన విడుదలై మొదటి షో నుంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా నార్త్ లోను భారీ వసూళ్లను రాబడుతోంది. ఇప్పటివరకు ఈ సినిమా రూ. 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టినట్లు చిత్రబృందం అధికారికంగా అనౌన్స్ చేసింది. ఇదిలా ఉండగా....సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్గా ఇలియానా నటించింది. ఇక సురేందర్ రెడ్డి ముందుగా కిక్ సినిమాలో హీరోగా రవితేజను కాకుండా ఎన్టీఆర్ ను అనుకున్నారట. అంతేకాకుండా ఈ సినిమా కథను ఎన్టీఆర్ కు వినిపించారట. కానీ అప్పటికే ఎన్టీఆర్ వేరే సినిమాలతో బిజీగా ఉన్నాడట. అయినప్పటికీ సినిమా కథ నచ్చడంతో ఎన్టీఆర్ డైరెక్టర్ ని కొంత సమయం కావాలని కోరాడట.



కానీ అంత సమయం తన వద్ద లేదని సురేందర్ రెడ్డి ఆ కథను రవితేజకు వినిపించాడట. ఇక ఆ సినిమా కథ నచ్చడంతో రవితేజ కిక్ సినిమాలో హీరోగా నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమా రవితేజ కెరీర్ నే పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. ఈ సినిమాని ఎన్టీఆర్ కనుక చేసుంటే ఇంకా బాగుండేదని ఎన్టీఆర్ అభిమానులు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: