అతి తక్కువ సమయంలోనే తన వివాహ బంధానికి అమలాపాల్ ముగింపు పలికింది. అనంతరం జగత్ దేశాయ్ ను వివాహం చేసుకుంది. వివాహ అనంతరం అమలాపాల్ సినిమాలు చేయడం మానేసింది. రీసెంట్ గా ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. అమలాపాల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా తన అభిమానులతో షేర్ చేసుకుంటుంది అమలాపాల్.
రీసెంట్ గా తన ఫ్యామిలీతో కలిసి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలో అమలాపాల్ కొన్ని బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. వివాహమై మగ బిడ్డకు జన్మనిచ్చిన కూడా అమలాపాల్ అందాలు ఏమాత్రం తగ్గడం లేదు. ఎప్పటిలాగే తన అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఫోటోలు చూసిన కొంత మంది పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇది ఇలా ఉండగా... గతంలోనే... హీరోయిన్ అమలాపాల్ కి పెళ్లయిన సంగతి తెలిసిందే. దర్శకుడు ఎల్ విజయ్ ని... అమలాపాల్ పెళ్లి చేసుకోవడం జరిగింది. వీరిద్దరూ కొన్ని రోజులపాటు... ఆనందంగా తమ వైవాహిక జీవితాన్ని గడిపారు. కానీ ఉన్నఫలంగా ఏమైందో తెలియదు కానీ... ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. దీంతో ఎల్ విజయ్ ని... వదిలేసింది హీరోయిన్ అమలాపాల్. అదే సమయంలో జగత్ దేశాయిని వివాహం చేసుకుంది.