తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఓ మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సుహాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఇక ఆయన కొంత కాలం క్రితం కలర్ ఫోటో అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. కానీ ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడం , ఇందులో సుహాస్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈయనకు హీరోగా మంచి గుర్తింపు లభించింది.

ఆ తర్వాత కూడా ఈయన కొన్ని సినిమాల్లో హీరోగా నటించడం , అందులో ఎక్కువ శాతం సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈయనకు హీరోగా కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఈయన హీరోగా రూపొందిన సినిమాలు కాస్త ప్రేక్షకులను నిరుత్సాహ పరుస్తున్నాయి. కొంత కాలం క్రితం గొర్రె పురాణం సినిమాతో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన సుహస్ తాజాగా జనక అయితే గనక అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 14 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయింది. 14 రోజుల్లో ఈ సినిమా నైజాం ఏరియాలో 1.22 కోట్ల కలెక్షన్లను వసూలు చేయగా , ఆంధ్ర ఏరియాలో 1.38 కోట్ల కలెక్షన్లను వసూలు చేసింది.

ఇక మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.60 కోట్ల షేర్ ... 4.70 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఈ మూవీకి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్సీస్ లలో కలుపుకొని 55 లక్షల కలెక్షన్లను వసూలు చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 3.15 కోట్ల షేర్ ... 6 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఇక ఈ మూవీ 4.5 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ హిట్ స్టేటస్ ను అందుకోవాలి అంటే ఇంకా చాలానే కలెక్షన్లను వసూలు చేయవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: