మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఈ మధ్య కాలంలో వరుస పెట్టి తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తున్నాడు. కొంత కాలం క్రితం ఈ నటుడు మహానటి అనే సినిమాలో కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన సీత రామం అనే సినిమాలో హీరో పాత్రలో నటించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయం సాధించడంతో ఈయన క్రేజ్ తెలుగులో మరింతగా పెరిగింది. 

ఇకపోతే కొంత కాలం క్రితం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2898 AD అనే సినిమా వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో ఓ చిన్న పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన లక్కీ భాస్కర్ అనే తెలుగు సినిమాలో హీరోగా నటించాడు. మీనాక్షి చౌదరి ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... జీ వీ ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మించాడు.

ఈ సినిమాను అక్టోబర్ 31 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను అక్టోబర్ 30 వ తేదీ సాయంత్రం 6 గంటల నుండే మొదలు పెట్టబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ మూవీ బృందం అక్టోబర్ 30.వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి ఈ మూవీ కి సంబంధించిన ప్రీమియర్స్ ప్రారంభించనున్నట్లు అక్టోబర్ 30 వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణలో కలిపి 100 కు పైన ప్రీమియర్ షో లు ప్రదర్శించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ప్రీమియర్ షో ల ద్వారా ఈ మూవీ కి మంచి టాక్ వస్తే రిలీజ్ రోజు ఈ మూవీ కి భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: