యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటించింది. ఈ మూవీ తోనే ఈ ముద్దుగుమ్మ తెలుగు తెరకు పరిచయం అయింది. సైఫ్ ఆలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీకాంత్ , ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలలో నటించారు. సెప్టెంబర్ 27 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 500 కోట్లకు పైగా కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసి 600 కోట్ల వైపు దూసుకుపోతుంది. 

సినిమా అదిరిపోయే రేంజ్ విజయం సాధించడంతో ఈ మూవీ బృందం ఫ్యాన్స్ సెలబ్రేషన్ షో ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ మూవీ బృందం వారు శ్రీ రాములు 70 ఎం ఎం థియేటర్లో అక్టోబర్ 26 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకి ఫ్యాన్స్ సెలబ్రేషన్ షో ను నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది.

ఇకపోతే ఇప్పటి వరకు నాలుగు వారాల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఇప్పటికీ కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డ్ ను కనబరిస్తూ కొత్త సినిమాలకు గట్టి పోటీని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇస్తుంది. ఇకపోతే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో నటించాడు.  ఒక పాత్రలో తండ్రి గానూ , మరొక పాత్రలో కొడుకు గానూ నటించిన జూనియర్ ఎన్టీఆర్ రెండు పాత్రలలోనూ తన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: