కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమాలో కృతి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాను నటించిన మొదటి సినిమాతోనే ఈ చిన్నది మంచి వసూళ్లను రాబట్టింది. అనంతరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేసుకుంటూ బిజీ హీరోయిన్గా మారిపోయింది.


ఉప్పెన సినిమా అనంతరం శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలు కృతికి మంచి సక్సెస్ ఇచ్చాయని చెప్పాలి. అనంతరం కృతి నటించిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారాయి. దీంతో ప్రస్తుతం కృతికి తెలుగులో పెద్దగా అవకాశాలు రావడం లేదు. ఏవో కొన్ని సినిమాల్లో మాత్రమే నటిస్తోంది. ఇక ఈ మధ్య కాలంలో కృతి శెట్టి మలయాళం, తమిళంలో సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది.


ఇదిలా ఉండగా.... కృతి శెట్టి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ తనని ఓ టాలీవుడ్ స్టార్ హీరో ఇబ్బంది పెడుతున్నాడు అంటూ చెప్పుకొచ్చింది. చాలా రోజుల నుంచి తనకి ఆ హీరో రాత్రి సమయాల్లో ఫోన్ కాల్స్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పింది. నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి పదే పదే ఫోన్ చేస్తున్నాడంటూ బిగ్ బాంబు పేల్చింది. అంతేకాకుండా వేరే నంబర్స్ నుంచి కూడా ఫోన్ కాల్స్ చేస్తున్నాడంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.


ఇకనుంచి అయినా ఆ హీరో ఇలాంటి పనులు చేయడం మానుకోవాలంటూ కృతి శెట్టి వెల్లడించింది. ఆ హీరో ఎవరు అనే విషయాలు మాత్రం కృతి శెట్టి చెప్పలేదు. అంతేకాకుండా సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో కూడా తనని చాలా సార్లు ఆ హీరో ఇబ్బంది పెట్టాడని వెల్లడించింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: