* విజయనిర్మల తర్వాత మళ్లీ అంతటి పేరు నందినికే దక్కింది

* ఎక్కువ సినిమాలు తీస్తూ వరుసగా సక్సెస్ లు అందుకుంది  

* చివరికి ఒక్క సినిమా కూడా చేయలేని పరిస్థితికి చేరుకుంది

( ఏపీ - ఇండియా హెరాల్డ్)

టాలీవుడ్ ఇండస్ట్రీలో 44 సినిమాలు డైరెక్ట్ చేసి రికార్డ్ సృష్టించింది విజయనిర్మల. ఆమె ఎక్కువ సినిమాలు తీసిన మహిళా డైరెక్టర్ గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేసింది. ఆమె తర్వాత మళ్లీ నందిని రెడ్డి మన తెలుగులో ఎక్కువ సినిమాలు డైరెక్ట్ చేసి ఆశ్చర్యపరిచింది. "అలా మొదలైంది" సినిమాతో నందిని రెడ్డి డైరెక్టోరియల్ కెరీర్ మొదలైంది. ఈ మూవీకి సొంతంగా స్టోరీ అందించింది. ఈ రొమాంటిక్ కామెడీ ఫిలిం లో నేచురల్ స్టార్ నాని, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీ తర్వాత వారికి విపరీతమైన పేరు వచ్చింది. నందిని రెడ్డి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.  

నందిని రెడ్డి 2013లో రొమాంటిక్ కామెడీ మూవీ  "జబర్దస్త్" తీసి మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇందులో సిద్ధార్థ్, సమంతా రూత్ ప్రభు, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా నటించారు. నాగ శౌర్య, మాళవిక నాయర్, రాశి, ఐశ్వర్య ఇందులో చాలా మంచి పర్ఫామెన్స్ కనబరిచి అలరించారు. సినిమా క్రిటిక్స్ ఈ మూవీ అద్భుతంగా ఉందని కామెంట్లు చేశారు. నందిని రెడ్డి దర్శకత్వం వహించిన ఫాంటసీ కామెడీ చిత్రం "ఓ!  బేబీ (20190" పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. ఇందులో అగ్రతార సమంత రూత్ ప్రభు, లక్ష్మి నటించారు. ఈ సినిమా ఎంత బాగుందంటే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. ఇది ఒక కొరియన్ సినిమాకి రీమేక్ అయిన తెలుగు వారికి నచ్చేలాగా తీయడంలో ఆమె సక్సెస్ సాధించింది.

దీని తర్వాత నందిని రెడ్డి ఒక హిట్ కూడా అందుకోలేకపోయింది. ఓ బేబీ తర్వాత ఆమె మొత్తం గా రెండు సినిమాలు చేసింది. వాటిలో ఒకటి "పిట్ట కథలు". ఇది ఒక నెట్‌ఫ్లిక్స్‌ ఫస్ట్ తెలుగు ఒరిజినల్ మూవీ. దీనికి మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి. బాగుంది అని చెప్పలేదు, అలాగే బాగోలేదు అని కూడా చెప్పలేదు. దీనిని క్రిటిక్స్ మెచ్చుకున్నారు కానీ పెద్దగా ఇది హిట్ అవ్వలేదు ఈ మూవీ తీసినట్లు అది నందిని రెడ్డి సినిమా అన్నట్లు కూడా ఎవరూ తెలుసుకోలేకపోయారు. 2023లో ఆమె తీసిన "అన్నీ మంచి శకునములే" సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇదొక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అయితే ఇందులో హీరో హీరోయిన్ల మధ్య సాగే ప్రేమ కథ చాలా స్లోగా నడుస్తుంది. ఆమె అనవసరంగా చాలా సీన్లు సాగదీసింది అసలు ఈ మూవీ తీసింది నందిని రెడ్డేనా అని చాలామంది ఆశ్చర్యపోయారు. ఒక ఫిమేల్ రాజమౌళి లాగా పేరు తెచ్చుకుని ఈమె ఈ సినిమాతో పేరు లేకుండా పోయింది. ఈ మూవీ తీసి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమె ఒక ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేయలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: