చాలా మంది జనాలు డబ్బు ఉంటే చాలు..మన చేతికి ఏమైన వస్తుంది..హ్యాపీ గా ఉండచ్చు అనుకుంటుంటారు. కానీ అది తప్పు. "డబ్బు" ఏది మనకి సంతోషాన్ని ఇవ్వలేదు అని మన పెద్దవాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారు . బహుశా బాలయ్య విషయంలో అది నిజమే అనిపిస్తుంది . బాలయ్యకు ఏమి తక్కువ చెప్పండి..?  స్టార్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి అబ్బాయి ..మంచి భార్య ..ముగ్గురు పిల్లలు అంతకుమించిన స్టార్ స్టేటస్.. అడిగితే ప్రాణాలని ఇచ్చే అభిమానులు . బాలయ్యకు ఏం లోటు లేదు.  కానీ బాలయ్య ఓ విషయం కారణంగా ఇప్పటికి బాధపడుతూనే ఉంటారట .


బాలయ్యకు మొదటి నుంచి ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టమట . తన ఇంట్లో ఒక పాప అయినా ఉంటే బాగుంటుంది అంటూ చాలా ఆశపడ్డారట. ఆ కోరికను దేవుడు బాగా ఆలకించి ఇద్దరు కూతుర్లను ఇచ్చారు . అయితే ఈ వయసులో బాలయ్య మనవరాళ్లతో ఆడుకోవాలని ఆశపడుతున్నారట . మనకు తెలిసిందే బాలయ్య ఇద్దరు కూతుర్లు బ్రాహ్మీణికి - తేజస్వినికి ఇద్దరికీ కూడా కొడుకులు . కానీ బాలయ్యకు ఒక చిన్ని పాప ఉంటే బాగుంటుంది.. ఇంటికి మహాలక్ష్మి కల వస్తుంది అంటూ చాలా సార్లు ఆశపడ్డారట .



కానీ ఆ కోరిక నెరవేరలేదు . ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందా..? అంటూ బాలయ్య వెయిట్ చేస్తున్నారు . కొన్ని కొన్ని సార్లు ఎవరైనా ఆడపిల్లల్ని ఎత్తుకొని ఉన్నప్పుడు బాలయ్యకు తనకు మనవరాలు లేరే అన్న విషయం గుర్తొస్తుందట. చాలా చాలా బాధపడతారట. నందమూరి బాలయ్య భార్య వసుంధర కి కూడా ఆడపిల్లలంటే చాలా చాలా ఇష్టం . కొడుకు విషయంలో నైనా ఆ కోరిక నెరవేరుతుందేమో అనుకుంటే..అది ఇప్పుడల్లా జరగని పని. నందమూరి మోక్షజ్ఞకు ఇప్పుడే పెళ్లి చేయరు . అది జరగాలంటే ఒక 10 ఏళ్ల పైమాటే అంటూ మిగతా ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: