చిత్ర పరిశ్రమలోకి వచ్చిన వారిలో కొందరు మాత్రమే చిన్న వయసులోనే నేషనల్ రేంజ్‌లో పాపులారిటీని సొంతం చేసుకున్నారు. తద్వారా వరుసగా ఆఫర్లను అందుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో ఎస్తర్ అనిల్ ఒకరు. దృశ్యం అనే సినిమాతో ఎన్నో భాషల్లో పరిచయం అయిన ఈ అమ్మడు.. ఆ తర్వాత చాలా భాషల్లో అవకాశాలను అందుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే స్పీడుతో సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఇక, సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఎస్తర్.. తాజాగా కొన్ని ఫొటోలను షేర్ చేసింది.టీనేజ్‌లో ఉన్నప్పుడే ఎస్తర్ అనిల్ 'నల్లవన్' అనే మలయాళ సినిమాతో నటిగా కెరీర్‌ను ప్రారంభించింది. అయితే, ఈ చిత్రం మాత్రం డిజాస్టర్‌గా మిగిలిపోయింది. కానీ, ఆ తర్వాత ఈ చిన్నది ఓరు నాల్ వరుము అనే సినిమాలో నటించింది. ఈ చిత్రంతో ఎస్తర్ అనిల్‌ మంచి గుర్తింపు అందుకుంది. దీంతో ఆమె ఫిల్మ్ మేకర్ల దృష్టిలో పడి ఫుల్ ఫేమస్ అయింది.'దృశ్యం' మూవీ తర్వాత ఎస్తర్ అనిల్‌‌కు అన్ని భాషల్లోనూ మంచి పేరు వచ్చింది. 

ముఖ్యంగా తెలుగులో ఈమె విశేషమైన గుర్తింపును తెచ్చుకుంది. దీంతో ఆ తర్వాత ఈ అమ్మడు 'జోహార్' అనే తెలుగు సినిమాలో లీడ్ రోల్ కూడా చేసింది. కానీ, ఆ తర్వాత ఎందుకనో ఆమె మరో సినిమాను ఒప్పుకోలేదు. కానీ, మరోసారి 'దృశ్యం 2' మూవీతో ఎస్తర్ అనిల్ మరింతగా అలరించింది.సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో ఎస్తర్ అనిల్ ఓ రేంజ్‌లో గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిన్నది బీచ్‌లో బికీనీ ధరించి తీసుకున్న బోల్డు ఫొటోలను షేర్ చేసింది. తాజాగా వెకేషన్ వెళ్లిన ఈ ఎస్తర్ అనిల్ రెడ్ కలర్ బికీనిలో కనిపించింది. ఓ కాటేజ్ లో ఓయ్యారులు పోతూ ఫోటోలను ఫోజులు ఇచ్చింది. ఈ హాట్ ఫోటోలను ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఎస్తర్ అనిల్ ఫోటోస్ చూసి నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. నిన్నమొన్నటివరకు చైల్డ్ ఆర్టిస్ గా కనిపించిన చిన్నారి నేడు గ్లామర్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా ఫోటీ పడుతుందంటూ కామెంట్ చేస్తున్నారు. నెటిజన్లు.వీటిలో ఈ అమ్మడు గ్లామర్ షో చేస్తోంది. ఫలితంగా ఎస్తర్ అనిల్ షేర్ చేసిన ఫొటోలకు నెటిజన్ల నుంచి భారీ స్థాయిలో స్పందన లభిస్తోంది. తద్వారా ఇవన్నీ వైరల్‌గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: