మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. టాలీవుడ్‌ స్టార్‌ నటుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ ని 2012లో వివాహం చేసుకుంది. ఉపాసన లండన్ లోని రీజెంట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ పూర్తి చేసింది. ప్రస్తుతం అపోలో హాస్పిటల్స్ లో కీలక పదవిని పోషిస్తుంది. ఉపాసన "ఆల్ ఇన్ వన్ వెల్ నెస్ ప్లాట్ ఫారమ్ URLife"కి అధిపతిగా కూడా వ్యవహరిస్తున్నారు.

భారతదేశంలోని అత్యంత ధనిక జంటలలో ఒకరిగా కొనసాగుతున్నారు. వారి ఆస్తుల విలువ రూ. 2500 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రామ్ చరణ్ ఆస్తి విలువ రూ. 1,370 కోట్లు ఉండగా, ఉపాసన ఆస్తి విలువ రూ. 1,130 కోట్లు అని సర్వేలో వెళ్లడైంది. వీరికి క్లింకార అనే కుమార్తె కూడా ఉంది. ఉపాసన ఎవరైనా కష్టాల్లో ఉంటే ప్రతిసారి తన మంచి మనసును చాటుకుంటూనే ఉంటారు. అంతేకాకుండా మూగ జీవాల సంరక్షణకు నిత్యం తన వంతు సాయం చేస్తూనే ఉంటారు.


ఈ క్రమంలోనే తాజాగా రేణు దేశాయ్ మూగజీవాల సంరక్షణ కోసం శ్రీ ఆధ్య యానిమల్ షెల్టర్ పేరుతో ఏర్పాటుచేసిన సంస్థకు ఉపాసన తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ విషయాన్ని స్వయంగా రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన సంస్థకు మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసన సహాయం చేసినట్టుగా పేర్కొన్నారు.


ఈ సంస్థ కోసం ఓ అంబులెన్స్ ను కొనుగోలు చేశానని, దానికోసం ఉపాసన సహాయం చేసిందని రేణు తెలిపారు. రామ్ చరణ్ పెంపుడు శునకం రైమీ పేరుతో ఈ సహాయం చేసినట్టు తెలియజేశారు. దీంతో రేణు దేశాయ్ అంబులెన్స్ కొనుగోలు చేసేందుకు విరాళం అందించిన రైమికి స్పెషల్ థాంక్స్ అంటూ సోషల్ మీడియాలో రేణు దేశాయ్ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టుకు మెగా కోడలు, రామ్‌ చరణ్‌ భార్య ఉపాసనను ట్యాగ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: