దర్శకుడు వివి వినాయక్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఇండస్ట్రీలో మాస్ సినిమాలకు కొత్త అర్థం చెప్పిన దర్శకుడు వివి వినాయక్. ఒకప్పటివరకు కమర్షియల్ సినిమాలను తన మేకింగ్ స్టైల్ తో మరో స్టెప్ కు తీసుకువెళ్లాడు. అయితే సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదు కాబట్టి అందుకే కొన్నాళ్ల నుంచి ఈ దర్శకుడు ఇండస్ట్రీకి కాస్త దూరంగా ఉన్నాడు. చాలా రోజుల అనంతరం వినాయక్ నెక్స్ట్ సినిమాపై అనేక రకాల చర్చలు మొదలయ్యాయి. తెలుగు ఇండస్ట్రీలో మాస్ కు కొత్త అర్థం చెప్పిన వ్యక్తి.


దిల్, అది, ఠాగూర్, బన్నీ, కృష్ణ, లక్ష్మి, అదుర్స్, ఖైదీ నెంబర్ 150.... ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఒకప్పుడు ఇండస్ట్రీలో దర్శకుడు రాజమౌళి కన్నా ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు వివి వినాయక్. కానీ కొన్ని సంవత్సరాల నుంచి వినాయక్ సినిమాలు అస్సలు చేయడం లేదు. కనీసం ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలియడం లేదు. ఖైదీ నెంబర్ 150 సినిమా హిట్ అయినప్పటికీ ఆ సినిమా చిరంజీవి ఖాతాలోకి వెళ్లిపోయింది.


పైగా రీమేక్ సినిమా కావడంతో వినాయక్ కు క్రెడిట్ రాలేదు. 2018లో వచ్చిన ఇంటిలిజెంట్ తర్వాత తెలుగు సినిమాలేమీ వినాయక్ చేయడం లేదు. ఈ మధ్య బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిందీలో చత్రపతి సినిమా రీమేక్ చేసిన ఫలితం రాలేదు. ఆ మధ్య రవితేజతో ఓ సినిమా ఉందని ప్రచారం జరిగినప్పటికీ అది రూమర్ గానే మిగిలిపోయింది. కేవలం ఫామ్ లో వినాయక్ లేరని దూరం పెట్టారు అనుకుంటే పొరపాటు అవుతుంది.


ఎందుకంటే ఆయన కన్నా పెద్ద డిజాస్టర్ సినిమాలు ఇచ్చిన దర్శకులు ఇప్పుడు వరుసగా సినిమాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ వినాయక్ కు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని అందుకే కొన్ని రోజుల నుంచి రెస్ట్ తీసుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే మళ్లీ కం బ్యాక్ ఇవ్వడానికి వినాయక్ రెడీ అవుతున్నారు. ఈ విషయం తెలిసి వివి వినాయక్ అభిమానులు అందరూ తెగ సంబరపడిపోతున్నారు. స్ట్రాంగ్ సినిమాలతో మళ్లీ కం బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: