జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన దేవర పాటకు స్టెప్పులు వేసినందుకు.... ఆర్టీసీ డ్రైవర్ జీవితం రోడ్డు పాలైంది. అతని ఉద్యోగాన్ని తీసేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఈ సంఘటన తాజాగా వెలుగులోకి రావడం జరిగింది. కాకినాడ జిల్లాలో... అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగాన్ని తీసివేసింది ఏపీ ఆర్టీసీ. ఈ సంఘటన వివరాలు ఒకసారి పరిశీలిస్తే... లోవరాజు అనే  వ్యక్తి ఆర్టీసీలో.. అవుట్ సోర్సింగ్ డ్రైవర్ గా పని చేస్తున్నాడు.


నిత్యం తుని.. బస్సు ను అతను నడిపేవాడు. అయితే తాజాగా... లోవరాజు నడిపే... ఆర్టీసీ బస్సు సాంకేతిక కారణంగా ఆగిపోయింది. ఈ సంఘటన తుని ప్రాంతంలో రెండు రోజుల కిందట జరిగింది. తుని నుంచి రౌతుల పూడి వెళుతున్న సమయంలో... ఆర్టీసీ బస్సు ఆగిపోయింది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సులో విద్యార్థులు అలాగే కొంతమంది... సాధారణ జనాలు కూడా ఉన్నారు. అయితే ఆర్టీసీ బస్సు... ఆగిపోవడంతో డ్రైవర్ను విద్యార్థులు ఓ వింత కోరిక కోరారు.

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా పాటకు డాన్స్ చేయాలని... ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును... బస్సులో ఉన్న విద్యార్థులు అడగడం జరిగింది. దీంతో చేసేది ఏమీ లేక...  ఆ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజు వెంటనే దేవర పాటకు స్టెప్పులు వేశాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే తనకు ఇష్టమని... డాన్స్ ఇరగదీశాడు. అయితే ఈ వీడియో రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  అంతేకాదు అమెరికాలో ఉన్న మంత్రి నారా లోకేష్ కూడా దీనిపై స్పందించాడు.


సూపర్ బ్రదర్ అంటూ ఆర్టీసీ డ్రైవర్ లోవరాజును మెచ్చుకున్నాడు నారా లోకేష్. అయితే... డ్యూటీ చేయకుండా దేవర పాటకు డాన్స్ చేసినందుకు గాను... డ్రైవర్ లోవరాజు పైన యాక్షన్ తీసుకుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ. అతన్ని ఉద్యోగం నుంచి పీకేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది. అయితే దీనిపై ఆర్టీసీ డ్రైవర్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కోరితేనే డ్యాన్స్ చేశానని...  తన తప్పేమీ లేదంటున్నాడు ఆర్టీసీ డ్రైవర్. తనను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: