మెగా కుటుంబం నుంచి చిరంజీవి అల్లుడుగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ మొదటిలో మంచి విజయాలు అందుకున్నాడు. ఆర్య , బన్నీ లాంటి సూపర్ హిట్లను అందుకున్న ఆయన తర్వాత దేశముదురుతో భారీ విజయం సాధించి ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు . అయితే అల్లు అర్జున్ ఆయన కెరియర్లో సాధించిన విజయాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు . ఆయన కాలక్రమమైన చేస్తున్న సినిమాలు కొన్ని ఆశించనుఆయన  కాల క్రమేణా చేస్తున్న సినిమాలు కొన్ని ఆశించిన విజయాలు అందుకోలేదు. అలా ఆయన కెరియర్లో ఒక రెండు సినిమాలు ఆయన చేసి ఉండకపోతే బాగుండు అని ఇప్పటికీ ఆయన అభిమానులు బాధపడుతూ ఉంటారు .


ఇంతకీ ఆ సినిమాలు ఏమిటి అంటే.. సీనియర్ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన వరుడు సినిమా, ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏమాత్రం తన ఇంపాక్ట్ ను చూపించరు. ఈ సినిమా కథ కూడా పెద్దగా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయింది. ఇక‌ దాంతో ఈ మూవీ అల్లు అర్జున్ కెరీర్ లోనే డిజాస్టర్ గా మిగిలిపోయింది. అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ గుణశేఖర్ తో అసలు సినిమా చేయాల్సింది కాదు .. కానీ ఆ సమయంలో అనుకోకుండా గుణశేఖర్ తో సినిమా చేయాల్సి వచ్చింది. మహేష్ కు ఇచ్చిన విధంగా ఒక్కడు లాంటి సక్సెస్ ఇస్తారు అనుకుంటే భారీ డిజాస్టర్ ని మూటగట్టాడు .


అలాగే దీంతో పాటుగా కరుణాకర్ దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ సినిమా కూడా అల్లు అర్జున్ కి పెద్దగా ఇమేజ్‌ను ఐతే తీసుకురాలేకపోయింది. ఈ సినిమా కామెడీ ఓకే అనిపించినప్పటికీ కంటెంట్ పరంగా అంత గొప్పగా అయితే ఏమీ ఉండదు .  ఈ సినిమా యావరేజ్ గా ఆడినప్పటికీ ఒక స్టార్డంతో వెళ్తున్న అల్లు అర్జున్ కెరీర్ కి కొంత బ్రేక్ వేసిందని చెప్పాలి  అందుకే ఒక నటుడు ఎలాంటి సినిమా చేయాలి అనే దాని మీద చాలా వరకు కాశ్రాత్తులు చేసి ముందుకు వెళితే బాగుంటుందని సిని పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప2 సినిమాతో ప్రేక్షకుల‌ ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇక మరి ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: