ఇక మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. నిన్నటితో 50 సంవత్సరాల సినీ జీవితాన్ని పూర్తి చేసుకున్న మెగాస్టార్ .. ఇప్పటికీ ఇండస్ట్రీలో గాడ్ ఫాదర్ గా ఉన్నాడు. ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ ముందుకు వస్తున్నాడు.. మరి ఇలాంటి క్రమంలోని ఆయన చేసిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకు మంచి గుర్తింపు కూడా తెచ్చిపెడుతున్నాయి. ఇదంతా బాగానే ఉంది కానీ .. ఆయనకు బాడ్ నేమ్ తీసుకొచ్చిన కొన్ని సంఘటనలు కూడా ఆయన నిజ జీవితంలో చాలానే ఉన్నాయని విషయం చాలామందికి తెలియదు .


అసలు అవి ఏమిటి అంటే మొదటగా ఉదయ్ కిరణ్ ని తన అల్లుడుగా చేసుకోవాలని ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ చేసుకున్న తర్వాత ఆ పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. అలా ఉదయ్ కిరణ్ కి చిత్ర పరిశ్రమలో కెరియర్ లేకుండా చేశారు అనే అపవాదు చిరంజీవి మీద ఉంది .. ఇక నిజానికి చిరంజీవి ఇలా చేశాడో లేదో అనే విషయాలు పక్కన  పడితే  ఇలాంటి రోమర్స్ ఎందుకు ఆయన మీద చేస్తున్నారు అని చాలా సంవత్సరాల నుంచి చాలా మంది చిరంజీవి అభిమానులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .


ఇక నిజానికి ఉదయ్ కిరణ్ కెరియర్ను చిరంజీవి తొక్కేయలేదని చాలాసార్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు . అలాగే ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క కూడా ఈ విషయం మీద చాలాసార్లు బయటికి వచ్చి మాట్లాడింది. అయినప్పటికీ కూడా ఎవరు ఈ విషయం నమ్మటం లేదు. అలాగే ఉదయ్ కిరణ్ చావు వెనక కూడా చిరంజీవి హస్తం ఉందని కూడా అంటారు. అయితే ఈ విషయంలో చిరంజీవి చాలా వరకు బ్యాడ్ గా ప్రొజెక్ట్ అయితే దీని వెనక‌ సినీ పెద్దలు కూడా ఉన్నారని టాక్ ఇప్పటికే వినిపిస్తుంది . ఇక తన చిన్న కూతురు శ్రీజ విషయంలో కూడా చిరంజీవి చాలా వరకు బ్యాడ్ నేమ్ ని మూట కొట్టుకున్నాడు. ఇక  ఏదేమైనా కూడా చిరంజీవి కెరియర్  లో మారని మచ్చలుగా మిగిలిపోయానే చెప్పాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: