"నాయకన్" తర్వాత మళ్లీ 36 ఏళ్లకు నట దిగ్గజం కమల్ హాసన్, దర్శక దిగ్గజం మణి రత్నం కలిసి చేసిన "థగ్ లైఫ్" పేరిట ఒక కొత్త సినిమా తీస్తున్నారు. ఇది ఒక యాక్షన్ డ్రామా మూవీ. ఈ సినిమాని విడుదలకై భారతదేశం వ్యాప్తంగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. త్వరలో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఆ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ ఇతర సినిమాల విడుదల తేదీలతో పోటీపడే అవకాశం ఉందని హాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
"థగ్ లైఫ్" సినిమా 2025, ఏప్రిల్ 10న అనేక భాషల్లో విడుదల కాబోతుందని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే రోజు ప్రభాస్ నటించిన "రాజా సాబ్" అనే హారర్ కామెడీ ఫిలిం కూడా విడుదల కాబోతుంది. అందువల్ల రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వద్ద పెద్ద పోటీ నెలకొనే అవకాశం ఉందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తమిళ కొత్త సంవత్సరం రోజున సినిమా విడుదల చేస్తే, తమిళ సినిమాలకు బాగా ఆదాయం వస్తుంది. కానీ, ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద స్టార్ కాబట్టి, తమిళం తప్ప మిగతా భాషల్లో "థగ్ లైఫ్" సినిమాకు పెద్ద పోటీ ఉంటుంది.
రాజా సాబ్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులైతే చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాహుబలి తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా చేసింది లేదు. దాకా ఒక ఫ్యామిలీ కామెడీ హారర్ ఎంటర్టైన్ లో ఆయన నటిస్తే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఫ్యామిలీ తో సహా థియేటర్ లోకి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారు. కానీ తమిళ ఇండస్ట్రీలో మాత్రం ఈ సినిమా ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే కమల్ హాసన్‌కు అక్కడ చాలా పెద్ద మార్కెట్ ఉంది. ఇంకా మణిరత్నం సినిమా అంటే తప్పకుండా చూస్తారు. ప్రభాస్ సినిమాని స్కిప్ చేయడానికే మొగ్గు చూపవచ్చు. తెలుగు మార్కెట్ కూడా పెద్దదే కమల్ హాసన్ కి కూడా ఇక్కడ పెద్ద అభిమానులు ఉన్నారు. కానీ ప్రభాస్ ని ఢీ కొట్టాలని చూస్తే తెలుగు రాష్ట్రాల్లో ఆయన భస్మం అయ్యే అవకాశం ఉంది. ఏ హీరో చేయని ధైర్యం ఇతను చేస్తున్నాడని చెప్పవచ్చు.
ఇక కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ సినిమాలో చాలా మంది ప్రముఖ నటులు నటిస్తున్నారు. వారిలో శింబు, జోజు జార్జ్, అలీ ఫజల్, అశోక్ సెల్వన్, పంకజ్ త్రిపాఠి, నాజర్, త్రిష కృష్ణన్, అభిరామి గోపికుమార్, ఐశ్వర్య లక్ష్మి, జిషు సెన్‌గుప్తా, సాన్యా మల్హోత్రా, రోహిత్ సారఫ్, వైయపురి వంటి నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.