సీనియర్ హీరోగా పేరు పొందిన బాలయ్య అటు రాజకీయాలలో సినిమాలలోనే కాకుండా ఇప్పుడు మరొక కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. బాలయ్య ఎన్నో ఏళ్ల నుంచి ఒక సినిమా స్టూడియోని నిర్మించాలనుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్రంలో ఈ ఫిలిమ్ స్టూడియోని సైతం నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆంధ్రకు చెందిన టిడిపి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా బాలకృష్ణ తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా బంపర్ ఆఫర్ ను ఇచ్చింది.


సినీ స్టూడియో నిర్మించుకోవడానికి ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. బాలయ్య సినిమా స్టూడియోని నిర్మించేందుకు భూమి కేటాయింపులు కూడా జరుగుతున్నాయని రెవెన్యూ శాఖ ఆమోద ముద్ర వేసిందని.. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి కూడా ఈ విషయాన్ని పంపించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.క్యాబినెట్ సమావేశాలలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశం పైన పలు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ ప్రాంతంలో నగర శివారులో బాలకృష్ణ స్టూడియోకి సైతం కొంత భూమిని కేటాయించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సినీ స్టూడియో నిర్మించాలని బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా కసరత్తులు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రాలో బాలయ్య సినీ స్టూడియో కట్టడానికి 500 ఎకరాలు కూడా స్థలం కేటాయించారని.. కానీ 2019లో ప్రభుత్వం మారడంతో వైజాగ్ లో స్టూడియోలు నిర్మించాలని అప్పటి ప్రభుత్వం ప్రకటించడంతో బాలయ్య స్టూడియో ప్రతిపాదన ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి టిడిపి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా స్టూడియో నిర్మించడానికి తెలంగాణలో స్థలాన్ని కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా సినీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ చేయడానికి విజయవాడకు రావాలి అని తెలియజేశారు. మరి అటు తెలంగాణలో నిర్మిస్తార విజయవాడలో బాలయ్య నిర్మిస్తాడా అనే విషయం తెలియాల్సి ఉన్నది. హైదరాబాదులో ఇప్పటికే చాలా ఫిలిం సిటీ లో ఉన్నాయి. ఒకవేళ స్టూడియో నిర్మిస్తే బాలయ్య ఇందులో సక్సెస్ అవుతారా లేదా అనే విషయం కూడా తెలియాల్సి ఉన్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: