అంతేకాదు పలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా బాలయ్య ప్రవర్తించిన తీరు మనం చూసాం. మరీ ముఖ్యంగా భగవంత్ కేసరి ప్రీ రిలీజ్ ఈవెంట్లో బాలయ్య ఎంత బోల్డ్ గా ఎంత హాట్ గా మాట్లాడారో అందరికీ తెలిసిందే . అప్పట్లో పొలిటికల్ ఇష్యూస్ ని కూడా పరోక్షకంగా ఘాటుగానే స్పందించాడు బాలయ్య . అటువంటి బాలయ్య కి కోపం వస్తే ఎవరైనా షివరింగ్ తో వణికి పోవాల్సిందే . పెద్ద పెద్ద స్టార్స్ కూడా బాలయ్య కోపానికి బలైపోయారు. అయితే ఆయన కూతుర్లు బ్రాహ్మణి - తేజస్విని .. కొడుకు మోక్షజ్ఞ మాత్రం బాలయ్య కోపం వస్తే చాలా కూల్ గా ఫిదా చేసేస్తారట. బాలయ్య ఎంత కోపం లో ఉన్నా సరే ఆ పని చేయగానే బాలయ్య టక్కున నవ్వేస్తాడట .
అది నందమూరి ఫ్యామిలీ ట్రిక్ అంటూ కూడా తెలుస్తుంది . బాలయ్య ఏదైనా పనిలో ఉన్నప్పుడు లేదా ఏదైనా ఇంపార్టెంట్ పని గురించి మాట్లాడుతున్నప్పుడు ..ఎవరైనా మాట్లాడిస్తే ఆయనకు చాలా కోపం వస్తుందట . చాలా సందర్భాలలో పిల్లలు ఇంట్లో అదే విధంగా డిస్టబెన్స్ కూడా చేశారట . అయితే బ్రాహ్మణి - తేజస్విని మాత్రం బాలయ్య కు కోపం వస్తే సైలెంట్‌గా రూమ్‌లో వెళ్లి కూర్చునేస్తారు. కానీ మోక్షజ్ఞ మాత్రం పరిగెత్తుకుంటూ వెళ్లి బాలయ్యను వెనకనుంచి హగ్ చేసుకుని ముక్కు మీద వరుసగా ముద్దులు పెడుతూ బాలయ్య కోపాన్ని కూల్ చేసేస్తారట . అలాంటి ట్రిక్ తో నందమూరి మోక్షజ్ఞ బాలయ్య కోపం నుంచి తప్పించుకుంటూ వచ్చాడు. అంతేకాదు బ్రాహ్మణి - తేజస్విని తండ్రి మాటకు ఎంతో విలువ ఇస్తారు. తండ్రి ఒక మాట చెప్తే చాలు ఆ మాటను జవదాటకుండా ఆ పని చేస్తారు. ఆ విషయం అందరికీ తెలిసిందే .అందుకే బ్రాహ్మణి - తేజస్విని అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు అభిమానులు..!