చిరంజీవి జీవితంలో ఉదయ్ కిరణ్ మరణం ఒక మాయని మచ్చలాగా మారిపోయింది. ఎందుకంటే ఉదయ్ కిరణ్ మరణించిన సమయంలో అందరూ చిరంజీవినే దోషిగా చిత్రీకరించారు. చాలామంది చిరంజీవి వల్లనే ఉదయ్ కిరణ్ మరణించారు అనే టాక్ ఇండస్ట్రీలో ప్రచారం చేశారు. అయితే చిరంజీవి పేరు బయటికి రావడానికి కారణం అప్పటికే ఉదయ్ కిరణ్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తో ఎంగేజ్మెంట్ చేసుకోవడమే.. సుస్మిత తో ఎంగేజ్మెంట్ అయ్యాక ఉదయ్ కిరణ్ ఈ పెళ్లిని కాదన్నాడు.కానీ ఆ తర్వాత ఉదయ్ కిరణ్ జీవితం మొత్తం తలకిందులైంది.ఆయన నటించిన సినిమాలేవి సరిగ్గా ఆడలేదు. అలాగే చిరంజీవి అల్లుడు అవుతున్నాడు అనే విషయం తెలుసుకున్న చాలామంది దర్శక నిర్మాతలు ఈయనతో పెద్ద ఎత్తున సినిమాలు చేయడానికి ఒప్పుకున్నారు.కానీ సుస్మిత తో పెళ్లి రిజెక్ట్ చేశాక ఆఫర్లన్నీ పోయాయట. 

దాంతో డిప్రెషన్ లోకి వెళ్లి ఉదయ్ కిరణ్ సూసైడ్ చేసుకోవడంతో ఈ తప్పంతా చిరంజీవి మీదే వేశారు. అయితే ఉదయ్ కిరణ్ మరణానికి చిరంజీవికి ఎలాంటి సంబంధం లేదు అని ఉదయ్ కిరణ్ సోదరి ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. కానీ ఈ విషయాన్ని మాత్రం కొంతమంది మర్చిపోవడం లేదు.ఎప్పటికప్పుడు దీన్ని ప్రచారం చేస్తూనే ఉంటారు. అయితే ఉదయ్ కిరణ్ కి సుస్మితకి పెళ్లి ఫిక్స్ అయ్యాక ఇండస్ట్రీలో ఉన్న ఓ హీరో చెప్పిన చెప్పుడు మాటలు విని ఉదయ్ కిరణ్ బంగారం లాంటి సుస్మితను వదులుకున్నారట.అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ అయ్యాక సుస్మిత గురించి టాలీవుడ్ లో ఉన్న ఓ హీరో చెడుగా చెప్పారట. ఆ అమ్మాయి క్యారెక్టర్ చాలా బ్యాడ్..

పెద్ద హీరో కూతురు ఇప్పటికే ఎంతోమందితో తిరిగింది.కానీ పెద్దింటి పిల్ల కాబట్టి ఈ విషయం ఎక్కడా బయటపడలేదు. ఆమెకి ఇప్పటికే ఎంతోమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు అని చెప్పుడు మాటలు చెప్పారట.అయితే ఈ మాటలన్నీ నిజమేనని నమ్మిన ఉదయ్ కిరణ్ చిరంజీవికి ఈ విషయం చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేశారట.కానీ చిరంజీవి మాత్రం మనం ఒక మంచి పని చేయాలంటే అడ్డుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. అలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వినకు అని చిరంజీవి ఎంత నచ్చజెప్పినా కూడా ఉదయ్ కిరణ్ వినలేదట.ఇక ఆ హీరో చెప్పుడు మాటలతో ఉదయ్ కిరణ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నారట. అప్పట్లో ఈ మేటర్ తెగ వైరల్ అయింది

మరింత సమాచారం తెలుసుకోండి: