సినిమా, రాజకీయం అనేవి ఒకదానితో ఒకటి ఎలాంటి సంబంధం లేని రెండు విభిన్నమైన రంగాలు అని చెప్పుకోవచ్చు. అయితే ఆ రెండు పూర్తిగా డిఫరెంట్ అయినా సరే సినిమా వాళ్లు రాజకీయాల్లోకి రాజకీయాల్లో ఉన్నవాళ్లు సినిమాల్లోకి జంప్ చేయడం కామన్. సినిమాల్లో సంపాదించిన క్రేజ్ తో యాక్టర్లు పాలిటిక్స్ లో పోటీ చేసే గెలుస్తుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు సినిమాల్లో నిర్మాతలుగా మారతారు. ఎన్టీఆర్, జయలలిత నుంచి పవన్ కళ్యాణ్, తలపతి విజయ్ వరకూ ఎంతోమంది పాలిటిక్స్ లోకి వచ్చారు. కేవలం హీరోలు మాత్రమే కాదు వీళ్ళందరూ క్యారెక్టర్ ఆర్టిస్టులు కమెడియన్లు కూడా రాజకీయాల్లో అరంగేట్రం చేస్తుంటారు.
విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం పొలిటికల్ గా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈ యాక్టర్ ఏం చెప్పాలనుకున్నా సరే స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా మాట్లాడేస్తుంటాడు. తాను ఒక వ్యక్తిని టార్గెట్ చేశాడంటే భయపడే సమస్య ఉండదు. అతడు ఎంత పెద్దవాడైనా సరే తాను ఏమనుకున్నాడో అది అనేస్తాడు. ఈ వ్యాఖ్యలు విన్నవారు చాలామంది ప్రకాష్ రాజుకు ధైర్యం ఉందని పొగుడుతారు. మరి కొంతమంది మాత్రం తీవ్రంగా విమర్శిస్తారు.
తాజాగా ప్రకాష్ రాజ్ నేటి రాజకీయాల్ని ఉద్దేశించి మరోసారి షాకింగ్ కామెంట్లు చేశాడు. తనకు సినిమా అవకాశాలు రాకపోయినా సరే పొలిటిషన్లకు గెలక్కుండా ఉండలేను అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. నేటి సమాజంలో ప్రజల సమస్యలపై గళం వినిపిస్తానని అన్నాడు. ప్రజల గొంతుకగా ఉంటానని స్పష్టం చేశాడు. సమాజంలో జరుగుతోన్న తప్పుల్ని చూస్తూ సైలెంట్ గా ఉండే రకం తాను కాదని పేర్కొన్నాడు. రాజకీయాల్లో ఒకరి తప్పులను ఎత్తి చూపినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుందని అన్నాడు. ప్రశ్నలు అడగలేని వారు ఉన్నప్పుడే ప్రజలు నష్టపోతారని తాను అలా జరగకుండా చూసుకుంటానని అన్నాడు. సామాన్య ప్రజల భవిష్యత్తు కోసం తాను పాటుపడతానని ప్రకాష్ రాజు తెలిపాడు. తాను ఎవరికి భయపడనని తప్పు చేసిన వారందరినీ విమర్శిస్తానని అన్నాడు. ప్రకాష్ రాజు వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.