టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీల ప్రస్తుతం మరో పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె నటన, డ్యాన్స్‌లో రెండింటిలోనూ ఇరగదీసేస్తుంది. ఇప్పటి వరకు ‘ధమాకా’ అనే సినిమాతో మాత్రమే పెద్ద హిట్ అందుకుంది. ఇటీవల సూపర్‌స్టార్ మహేష్‌బాబుతో కలిసి ‘గుంటూరు కారం’ సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. నితిన్‌తో కలిసి ‘రాబిన్ హుడ్’ అనే సినిమాలో కూడా నటించింది.

డిసెంబర్‌లో ‘రాబిన్ హుడ్’ అనే సినిమా విడుదల కాబోతోంది. ఇంకోవైపు రవితేజతో కలిసి మరో సినిమా చేస్తుంది. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో నటిస్తోంది. తమిళంలో కూడా ఒక సినిమా చేయబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్ని సినిమాలు చేస్తున్నా, శ్రీలీలకు అంతగా హిట్లు పడడం లేదు

శ్రీలీల ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఫోటోలు చాలా వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె ఒక బ్లాక్ స్కర్ట్‌లో చాలా అందంగా ఫోటోలు దిగి పోస్ట్ చేసింది. ఆ ఫోటోల్లో ఏదో వెస్ట్రన్ గర్ల్ లాగా కనిపించింది ఒక మామూలు గుడ్డ చుట్టుకుని తన అందాలన్నీ బయటపెట్టింది ఇంతకుముందు చీరలు లేదంటే ట్రెడిషనల్ ఇండియన్ డ్రెస్‌ల్లో ఆమె కనిపించేది కానీ ఇప్పుడు ఇలా బెస్ట్ అండ్ డ్రెస్సులో కనిపించడంతో అసలు ఇందులో కనిపించేది శ్రీలీలనేనా.. ఇలాంటి బట్టలు వేసుకుందేంటి బాబోయ్. అని కామెంట్లు చేస్తున్నారు.

మిగతా ఫ్యాన్స్ ఆమె అందాన్ని మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె కళ్ళు చాలా అందంగా ఉంటాయని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అవకాశాల కోసం శ్రీలీల తన అందాలను బయట పెట్టేందుకు రెడీ అయ్యిందని ఈ ఫోటోలు చూస్తుంటే అర్థమవుతోంది. మహేష్ బాబు కూడా ఆమె డ్యాన్స్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. కానీ ఆ డాన్స్ ఆమెను కాపాడలేక పోతోంది. మంచి కథ ఉన్న సినిమాలో మంచి పాత్రలు చేస్తేనే ఆమెకు మంచి గుర్తింపు వస్తుంది. ఎక్కువగా సినిమాలు చేసే అవకాశం లభిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: