స్టార్ హీరోలతో చేసే మల్టీ స్టార్ సినిమాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.. వారి అభిమానుల్ని మెప్పించే సన్నివేశాలు ఉండాలి ఒకవేళ ఏదైనా లోపం వచ్చిందంటే ఓ రేంజ్ లో డైరెక్టర్ ను వేసుకుంటారు. ఒకప్పటి దర్శకుడు శరత్ ఓ రేంజ్ లో పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా ముగ్గురు స్టార్ కృష్ణ లతో బడా మల్టీస్టారర్ మూవీ ని ప్లాన్ చేశాడు. ఆ సినిమానే సుల్తాన్.. బాలకృష్ణతో పెద్దన్నయ్య వంశానికొక్కడు వంటి బ్లాక్ బస్టర్ విజయాలు ఇచ్చిన సమయంలో సుల్తాన్ సినిమాను భారీ బడ్జెట్ తో చేశారు . సూపర్ స్టార్ కృష్ణ , రెబల్ స్టార్ కృష్ణంరాజు వంటి అగ్ర హీరోలతో ఈ మల్టీస్టారర్ ను తెరకెక్కించారు. ఈ సినిమా ఆ రోజుల్లో డిజాస్టర్ కావడానికి కారణం ఏమిటి అనే ఆసక్తికర విషయాలు ఇక్కడ చూద్దాం .


బాలకృష్ణ హీరోగా వచ్చిన సమరసింహారెడ్డి మూవీ హిట్ అయిన తర్వాత సుల్తాన్ వంటి భారీ ప్రాజెక్టును మొదలు పెట్టాడు. కృష్ణ , కృష్ణంరాజు ఇదురు కూడా బిజీగా ఉన్నారు. వారీ డేట్స్‌ ని అడ్జస్ట్ అవుతూ ప్రీ ప్రొడక్షన్  పనులు మొదలు పెట్టారు .. సుల్తాన్ కోసం ముందుగా దర్శకుడు శరత్ అనుకున్న కథ ఒకటి కానీ కృష్ణ , కృష్ణంరాజు వంటి పెద్ద స్టార్లు ఈ ప్రాజెక్టులో కలిశాక కథ‌లో ప‌లు మార్పులు చేశారు . ఈ మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపించారు. విలన్ గా కూడా బాలకృష్ణ నటించ‌రు.. అలాగే ఈ సినిమాలు ఏకంగా 11  గెటప్స్ లో ఆయన కనిపిస్తారు .


మూవీ షూటింగ్ అండమాన్ దీవుల్లో జరిగింది . బాలకృష్ణ, కృష్ణ , కృష్ణంరాజు స్పాట్ కి త‌మ ఫ్యామిలీస్ తో కలిసి వెళ్లేవారట . అక్కడ ఓ పాటను కూడా చిత్రీకరించారట. రాజీవ్ గాంధీ గెస్ట్ హౌస్ లో ఈ టీం బస చేసింది.. అక్కడ తినడానికి తిండి సరిగ్గా దొరికేది కాదట.. చిత్ర యూనిట్ బియ్యం కూరగాయలు తెప్పిస్తే విజయనిర్మల , శామల దేవి అక్కడ వారికి వంట చేసేవారట. అలా సమరసింహారెడ్డి వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమాతో పోలిస్తే అభిమానులు ఈ సినిమాని పెద్దగా ఆదరించలేదు కానీ ఇది అప్పట్లో గొప్ప ప్రయత్నం గా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: