బాలీవుడ్ లో అందం , అభినయం తో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్ల లో శ్రద్ధా కపూర్ కూడా ఒకరు .. చిన్న వయసు లోనే హీరోయిన్ గా చిత్ర పరిశ్రమ లో అడుగు పెట్టిన ఈముద్దుగుమ్మ .. ఆ తర్వాత తన ప్రతిభతో విమర్శకుల దగ్గర నుంచి ప్రశంసలు కూడా అందుకుంది . కేవలం 16 సంవత్సరాల వయసులోనే సల్మాన్ ఖాన్ నటించిన లక్కీ : నో టైమ్ ఫర్ లవ్ సినిమా లో ఆఫర్ వచ్చింది . అప్పటి కే తాను నటించడానికి సిద్ధంగా లేకపోవడం తో ఆ ఆఫర్ ను రిజెక్ట్ చేసింది ట ఈ ముద్దుగుమ్మ . ఆ తర్వాత సంవత్సరం వచ్చిన తీన్ పట్టి సినిమాతో వెండితెర పై అడుగుపెట్టింది ..
కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది . ఆ తర్వాత ఆమె నటించిన వరుస సినిమా లు డిజాస్టర్లు గా నిలిచాయి .. అదే సమయం లో బాలీవుడ్ హీరో ఆ ఆదిత్య రాయ్ కి జంట గా నటించిన ఆషికీ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హీట్ కావడం తో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయింది .. ఆ తర్వాత ఈ బ్యూటీ వరుస సినిమా లో నటిస్తూ బిజీగా మారిపోయింది . పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన సాహో సినిమా తో సౌత్ ప్రేక్షకుల ముందు కూడా వచ్చింది శ్రద్ధా కపూర్ .. ఇక రీసెంట్ గానే స్త్రీ 2 సినిమా తో బంపర్ విజయాన్ని తన ఖాతా లో వేసుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాల కు కమిట్ అవుతూ శ్రద్ధా బిజీ గా కొనసాగుతుంది .