భారతీయ సినిమా ముఖచిత్రాన్ని మార్చేసిన సినిమా ఏదైనా ఉందంటే అది బాహుబలి.. అప్పుడు వరకు ఉన్న బడ్జెట్ లెక్కలు , బిజినెస్ లెక్కలు ఒక్కసారిగా తారు మారు చేసింది ఈ సినిమా.. కానీ ఆ తర్వాత మళ్ళీ అదే రేంజ్ హిట్‌ ఇంతవరకు రాలేదు. బాహుబలిని కొట్టే హిట్ ఇవ్వటం రాజమౌళి ప్రభాస్ వల్లే కూడా కాలేదు. ఇక మరి అప్‌ కమింగ్ సినిమాల్లో ఈ ఇద్దరిలో లేదా మిగిలిన హీరోలలో బాహుబలి2 రికార్డులను బ్రేక్ చేసేది ఎవరు? ఆ ఛాన్స్ ఎవరికి ఎక్కువగా ఉంది ?  భారతీయ సినిమా చరిత్రలోనే బాహుబలి గొప్ప టర్నింగ్ పాయింట్ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు . అప్పటి వరకు ఉన్న బడ్జెట్ బిజినెస్ లెక్కలు మార్చేసిన బాహుబలి 2 ఏకంగా 1800 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది .


ఇక దీంతో ఆ తర్వాత ప్రతి స్టార్ ఆ సినిమాను కొట్టాలని కసితోనే పాన్ ఇండియా మార్కెట్లోకి వస్తున్నారు. కానీ ఇప్ప‌టి వ‌రకు బాహుబలి రేంజ్ సినిమా ఇండియన్ స్క్రీన్ మీద మళ్ళీ రాలేదు. బాహుబలి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని త్రిబుల్ ఆర్ సినిమా చేశాడు రాజమౌళి. ఇద్దరు హీరోలతో చేస్తున్న ఈ సినిమా కూడా బాహుబలి 2 రేంజ్ లో ఒక మూలకు కూడా రాలేకపోయింది. 1300 కోట్ల వసూళ్ల దగ్గరే ఆగిపోయింది ఈ సినిమా. ఇక దీంతో ఇప్పుడు రాజమౌళి - మహేష్ కాంబోలో రాబోయే సినిమా అయినా బాహుబలి 2 రికార్డును బ్రేక్ చేస్తుందా అన్న ఆశతో అభిమానులు ఎదురు చూస్తున్నారు . బాహుబలి తర్వాత ప్రభాస్ ప్రకటించిన ఐదు సినిమాలు ఇప్పటికే ప్రేక్షకులు ముందుకు వచ్చాయి వాటిలో ఒక కల్కి మాత్రమే 1000 కోట్ల మార్కును దాటింది .


ఇక మిగిలిన సినిమాలు ఏవి కూడా కనీసం దరిద్రపులో కూడా రాలేదు. అందుకే ప్రభాస్ తన రికార్డును బ్రేక్ చేసే టైం కోసం ఆయన అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ది రాజా సాబ్, సలార్ 2, ఫౌజి, స్పిరిట్ , కల్కి 2 సినిమాలను ప్రస్తుతం ప్రభాస్ లైన్లో పెట్టారు . వీటిలో ఏ ఒక్క సినిమాతో అయినా 1800 కోట్ల మార్కును బీట్ చేయాలని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు . ఇక ప్ర‌భ‌స్ సినిమాల‌కు సూపర్‌ హిట్ టాక్ వస్తే ఆ రేంజ్‌ వసూళ్లు పెద్ద విషయమేం కాదన్నది డై హార్డ్ ఫ్యాన్స్ వర్షన్‌. మరి బాహుబలి 2తో రాజమౌళి, ప్రభాస్‌ కలిసి సెట్‌ చేసిన రికార్డ్‌ను ముందు ఎవరు సోలోగా బ్రేక్ చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: