టైటానిక్ మూవీ గురించి కొత్త‌ చెప్పక్కర్లేదు 1997వ సంవత్సరంలో విడుదలైన టైటానిక్ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రపంచ సినిమాని మొత్తం ఏకం చేసింది ఈ సినిమా.. ఆ రోజుల్లోనే టైటానిక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు .. మన తెలుగు రాష్ట్రాల్లోనే ప్రధాన ఏరియాలో వంద రోజులు కూడా ఈ సినిమా ఆడింది .. ఇప్పటివరకు ప్రపంచ మొత్తం మీద వచ్చిన బెస్ట్‌ లవ్ మూవీ కూడా ఇదే.  టైటానిక్ వచ్చిన రెండు సంవత్సరాలకి అంటే 1999లో పేద బడుగు బలహీన వర్గాల వారికి అండగా నిలిచిన పోరాట యోధుడు రాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీరాములయ్య మూవీ వచ్చింది.


సినిమా టైటానిక్ తర్వాత మూవీ గా నిలబడి చరిత్రలోనే తనకంటూ ఓ అరుదైన రికార్డును సొంతం చేస్తుంది. మరి ఇంతకీ ఈ సినిమా అందుకున్న ఆ రికార్డు ఏంటి? అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. అయితే ఈ సినిమాల్లో ప్రతి షార్ట్ కూడా ఎంతో వైవిధ్యంతో ఎంతో అద్భుతంగా ఉంటుంది . ప్రతి సీను కూడా మన కళ్ళ ముందు జరుగుతుందేమో అనే విధంగా కెమెరాతో తెర్కెక్కించారు . టైటానిక్ తర్వాత ఒకవేళ క్రైన్‌ తో షార్ట్ తీసిన రెండో సినిమాగా శ్రీరాములయ్య సినీ చరిత్రలో నిలిచిపోయింది . ఈ మూవీ ప్రారంభంలో టైటిల్స్ పడుతుంటే శ్రీరాములయ్య సమాధిని చూపించడం జరుగుతుంది..  ఆ సీన్ ని రకరకాల షాట్స్ లో టాప్ యాంగిల్ నుంచి చూపించారు.


ఒక హెలికాప్టర్ కి కెమేర‌ కట్టి ఆ షార్ట్ తీశారు . ప్రముఖ దివంగత నేత పరిటాల రవి తండ్రి రాములయ్య జీవిత కథ ఆధారంగా శ్రీరాములయ్య సినిమా ని తెరకెక్కించారు. ఎన్ కౌంటర్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టైటిల్ రోల్ లో మోహన్ బాబు అలానే ఆయన భార్యగా సౌందర్య నటించారు. శ్రీ రాములయ్య కొడుకు రవిగా కూడా మోహన్ బాబు నటించారు. దివంగత నటుడు నందమూరి హరికృష్ణ కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు ఈ సినిమాలో పాటలు ఇప్పటికి కూడా చాలా చోట్ల వినపడుతూనే ఉంటాయి .

మరింత సమాచారం తెలుసుకోండి: