ఇప్పుడంటే టాటూస్ ఎక్కువగా వేయించుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అలా కాదు . ఎవరో రేర్ గా మాత్రమే అలా టాటూస్ వేయించుకునేవారు . 1000లో ఒకరు అనే చెప్పాలి . ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు అయితే బాలీవుడ్ వాళ్ళు ఎక్కువగా టాటూస్ వేయించుకునేవారు . కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అసలు టాటూస్ వేయించుకోనే వేయించుకోరు. వేయించుకున్న వారు కూడా అరాకొర . అలా వేయించుకున్న ఆ విషయాన్ని బయట పెట్టేవారు కాదు.


ఇప్పుడు సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్త హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది. అయితే ఆ లిస్టు లోకి వస్తాడు మన అన్నగారు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు . ఎస్ స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి ఒంటి పై ఒకే ఒక్క పచ్చబొట్టు ఉంది.  అది కూడా ఆయన ఎంతో ఇష్టంగా వేయించుకునింది . ఆ పచ్చబొట్టు మరెదో కాదు "ఓం". మొదటి నుంచి  దైవభక్తి గల సీనియర్ ఎన్టీ రామారావు గారు .. తన వంటిపై ఒకే ఒక పచ్చబొట్టును  పొడిపించుకున్నాడు .



అది కూడా రాజకీయాల్లోకి వచ్చే ముందు . యస్.. ఇదే న్యూస్ ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ దేవుడు అనుగ్రహం ఆయన పైన ఉండాలి అని ..ప్రజలకు సేవ చేయాలి అనుకుంటున్నానని.. భక్తి భావంతో "ఓం" అనే టాటూను ఆయన ఒంటిపై వేయించుకున్నాడు.  ఈ విషయం చాలా చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు . కాగా సీనియర్ ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు . అటు రాజకీయాలలోనూ ఇటు సినిమాలలోను తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్నారు. అంతేకాదు ఆయన ఇప్పుడు మనమధ్య లేకపోయినా సరే ఆయనే ఫేవరెట్ హీరో అంటూ కోట్లాదిమంది అభిమానులు ఆరాధిస్తూ ఆయన పేరు జపిస్తూ ఉండడం గమనార్హం. ఈ ఒక్క విషయం తో చెప్పొచ్చు సినీ  ఇండస్ట్రిలో సీనియర్ ఎన్టీ రామారావు గారి స్థానం ఏంటో..!

మరింత సమాచారం తెలుసుకోండి: