యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన తెలుగు , తమిళ్ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి 600 కోట్ల వైపు ఫుల్ జోష్లో దూసుకుపోతుంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు వారాల బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అవుతుంది. నాలుగు వారాల బాక్సా ఫీస్ రన్ ముగిసే సరికి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున వసూళ్లను రాబట్టింది.

ఇక ఇప్పటికీ కూడా ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి హోల్డు ను కనబరుస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు కంప్లీట్ అవుతున్న తెలుగు రాష్ట్రాల్లో ఏ సినిమా కూడా ఈ మూవీ కి భారీ ఎత్తున పోటీ ఇవ్వలేదు. ఇది ఇలా ఉంటే ఒక సినిమా మాత్రం ఈ సినిమాకు పర్వాలేదు అనే స్థాయిలో పోటీ ఇచ్చింది. ఆ సినిమానే విశ్వం.

విశ్వం సినిమా ఈ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 11 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ కి మిక్స్ డ్ టాక్ వచ్చిన కూడా ఈ మూవీ పర్వాలేదు అనే స్థాయి కలెక్షన్లను బాక్సా ఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే దేవర సినిమా నాలుగు వారాల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ చేసుకున్న మధ్యలో విశ్వం సినిమా ద్వారా కాస్త పోటీ వచ్చిన వేరే ఏ సినిమా కూడా ఈ మూవీ కి పెద్ద స్థాయి పోటీని ఇవ్వలేదు. ఇకపోతే విశ్వం సినిమా కూడా పెద్ద స్థాయి విజయాన్ని అందుకునే అవకాశాలు ప్రస్తుతానికి కనబడడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: