తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి గోపీచంద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. గోపీచంద్ తాజాగా విశ్వం అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు కొన్ని సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగించిన శ్రీను వైట్ల దర్శకత్వం వహించగా ... ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్లో కెరీర్ను ముందుకు సాగిస్తున్న కావ్య దాపర్ ఈ సినిమాలో గోపీచంద్ కు జోడిగా నటించింది. ఇకపోతే ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది.

ఈ సినిమాకు థియేటర్లలో విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయిన కూడా ఈ సినిమా మంచి కలక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే ఈ సినిమాకు 27 కోట్ల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు డిజిటల్ హక్కుల ద్వారా పెద్ద మొత్తం లోనే డబ్బులు వెనక్కు వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ప్రముఖ ఓ టీ టీ సంస్థలలో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు  ,ఈ సంస్థ వారు ఈ సినిమా యొక్క ఓ టీ టీ హక్కులను ఏకంగా 11.50 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇక అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు ఈ సినిమా యొక్క తెలుగు హక్కులతో పాటు మరికొన్ని భాషల హక్కులను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ టి టి ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: