నందమూరి నట సింహం బాలకృష్ణ  గతేడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నారు.గతంలో వరుస ఫ్లాపుల్లో ఉన్న బాలకృష్ణకు బోయపాటి శ్రీను 'అఖండ' వంటి భారీ బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ అందుకొని హీరోగా బ్యాక్ బౌన్స్ అయ్యారు.అఖండ 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' సినిమాల్లో బాలయ్య తన ఏజ్‌కు తగ్గ పాత్రల్లో నటించి మెప్పించారు... ఇక భగవంత్ కేసరీ మూవీలో బాలయ్య పర్ఫెక్ట్ ఫాదర్ మెటీరియల్ లో తన వయసుకు తగ్గ పాత్రలో కనిపించి మెప్పించాడు. అంతేకాదు యాక్షన్ సీక్వెన్స్‌లలో అదరగొట్టాడు..అనిల్ రావిపూడి మొత్తంగా బాలయ్య బాడీ లాంగ్వేజ్ కు తగ్గ స్టోరీని రెడీ చేసి అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించాడు..ప్రస్తుతం బాలయ్య తన తర్వాత సినిమాను బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నాడు. NBK 109 వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.దీపావళి రోజున ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు. 

ఈ సినిమాకు ‘సర్కార్ సీతారామ్’, డాకూ మహారాజ్’ వంటి డిఫరెంట్ టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి. ఈ రెండిటిలో ఏది ఫిక్స్ చేస్తారనేది అయితే చూడాలి. దీపావళి పండగ సందర్భంగా ఈ సినిమాపై టైటిల్ పై వున్న డౌట్స్ అన్ని తీరిపోతాయి. ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా హిందీ డబ్బింగ్ వెర్షన్ కు బాలయ్యే డబ్బింగ్ చెప్తుందటం విశేషం... గతంలో ‘శ్రీరామరాజ్యం’, ‘భగవంత్ కేసరి’ సినిమాలకు హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇపుడు అదే రూట్లో బాబీ సినిమాకు కూడా తనే ఓన్ డబ్బింగ్ చెప్పనున్నట్లు సమాచారం..బాలయ్య, బాబీ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మరో ముఖ్యపాత్రలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌతెలా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: