తెలుగు బిగ్ బాస్ -8 సీజన్ మరొక వారం ఇప్పుడు ముగిసింది.. ఎప్పటిలాగే ఎవరూ ఎలిమినేట్ అయ్యారు అనే విషయం పైన అందరూ ఎక్సైటింగ్ గా ఉన్నారు.. అయితే ఈ వారం ఎలిమినేషన్ లిస్టులో నయని పావని అవతారనుకున్నప్పటికీ కానీ అనూహ్యంగా మెహబూబ్ హౌస్ నుంచి బయటికి వచ్చారు. 8వ వారంలో 6 మంది కంటెస్టెంట్ నామినేషన్ లో ఉండగా.. ఇందులో మెహబూబ్, నయని పావని కి తక్కువ ఓట్లు పడ్డాయి.. దీంతో ఈ ఇద్దరు అభిమానులు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని సందేహం ఉన్నప్పటికీ.. నయని పావనిని  నాగార్జునని సేవ్ చేయడం జరిగింది. మెహబూబ్ ని ఎలిమినేట్ చేసినట్లుగా ప్రకటించారు.


తన ఎలిమినేషన్ అయ్యారని తెలుసుకున్న మెహ బూబ్ నిరాశతో ఎమోషనల్ గా మాట్లాడారు.. గతంలో కూడా దీపావళి సమయంలో తన ఎలిమినేషన్ అయ్యానని.. ఇప్పుడు కూడా అదే పండుగకు ఎలిమినేషన్ అయ్యానని తెలియజేశారు.. అలా ఎందుకు జరుగుతోందో తనకు అర్థం కావడం లేదని ప్రతి టాస్క్ లో కూడా తాను బెస్టుగా ఇస్తూ ఉన్నానని కానీ దురదృష్టవశాత్తు బయటికి వచ్చేసాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడారు. ఈ విషయం చూసిన అభిమానులు కాస్త ఎమోషనల్ గానే కామెంట్స్ చేస్తున్నారు.


గత సీజన్లో బిగ్ బాస్-4 లో మెహ బూబ్ విజేతగా నిలవకపోయారు. ఇప్పుడు 8వ సీజన్లో కూడా వైల్డ్ కార్డు ద్వారా అడుగుపెట్టిన ఇప్పుడు కూడా విజేత కాలేకపోయారు. మొత్తానికి హౌస్ నుంచి ఎవరో అనుకుంటే ఎవరో ఎలిమినేట్ కావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి మెహబూబ్ కి ఉన్నన్ని రోజులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే విషయంపై ఇంకా సరైన క్లారిటీ రాలేదు. మరి ప్రత్యేకమైన ఇంటర్వ్యూలో మెహాబూబ్ ఎలాంటి విషయాలు బిగ్ బాస్ హౌస్ గురించి తెలియజేస్తారో చూడాలి మరి. బిగ్ బాస్ -8 విన్నర్ ఎవరో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: