- కొత్త నటులతో ఇండస్ట్రీ హిట్..
- నటీనటుల కెరీర్నే మార్చేసిన మూవీ..
- నిర్మాతలకు బంగారు పంట..

 
 సినిమా ఇండస్ట్రీ అంటేనే  కత్తి మీద సాము లాంటిది.  అలాంటి ఈ ఇండస్ట్రీలో నెగ్గాలి అంటే నటనా టాలెంట్ తో పాటు తీసే కథలో కాస్త బలం ఉండాలి. అలా ఉంటేనే సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.  ఆ విధంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయి రికార్డులు తిరగ రాసిన చిత్రాలలో నువ్వే కావాలి సినిమా కూడా ఒకటి. మరి ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 నువ్వే కావాలి రికార్డులు:
స్రవంతి రవి కిషోర్ కు మంచి నిర్మాతగా పేరుంది. కానీ ఇండస్ట్రీలో బ్రాండ్ గా నిలిచిపోయే సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇదే టైంలో మలయాళ మూవీ నీరాం రిలీజై సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమా రీమేక్ చేసి తెలుగులో తీయడం కోసం ఎంతోమంది ఆ సినిమా రైట్స్ కోసం ట్రై చేస్తున్నారు. దీంతో నీరం ప్రొడ్యూసర్ 70 లక్షల రేటు చెప్పారు. అప్పట్లో మలయాళం రైట్స్ రెండు మూడు లక్షలు ఉండేది. దీంతో రవికిషోర్ ఏం చేయాలో తెలియక జెడి చక్రవర్తి ద్వారా  ఈ సినిమా రైట్స్ 5 లక్షలకు పొందారు. హీరో గురించి ఆలోచిస్తున్న సమయంలో మహేష్ బాబుని అనుకున్నారు. కానీ ఆయన ఈ సినిమా ఒప్పుకోలేదు. చివరికి ఒక యాడ్లో  తరుణ్ ని చూసి కుర్రాడు బాగున్నాడు అని చెప్పి ఆడిషన్ కి పిలిచారట. హీరోగా తరుణ్ సెలెక్ట్ చేసి  హీరోయిన్ ను రీఛాను ఓకే చేసేసారు.


ఇక డైరెక్టర్లుగా విజయభాస్కర్, త్రివిక్రమ్ లను తీసుకున్నారు. మొత్తం కోటి 15 లక్షల బడ్జెట్ తో సినిమా తెరకెక్కింది. 2000 అక్టోబర్ 13, న 36 సెంటర్లలో రిలీజ్ అయిన నువ్వే కావాలి మూవీ మామూలుగా ఉంది అనే రేంజ్ నుంచి వారం గడిచే లోపల బీభత్సమైన ఫాలోయింగ్ పెంచేసుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చినటువంటి ఈ చిత్రం ద్వారా  తరుణ్ ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఈ చిత్రం 30 సెంటర్లలో వంద రోజులు, 20 సెంటర్లలో రెండు వందల రోజులు  10 సెంటర్లలో 250 రోజులు, ఆరు సెంటర్లలో 365 రోజులు ఆడింది అంటే ఈ చిత్రం అప్పట్లో ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అయిందో మనం అర్థం చేసుకోవచ్చు. కోటి రూపాయలతో వచ్చినటువంటి ఈ మూవీ 18 కోట్ల రూపాయలు వసూలు చేసి అప్పట్లో రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాకు బెస్ట్ ఫిలిం నేషనల్ క్యాటగిరిలో అవార్డు దక్కింది. ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. ఈ విధంగా చిన్న సినిమాగా వచ్చి  రికార్డులు సాధించిన ఈ చిత్రం  మహా అద్భుతమని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: