ప్యూర్ డిక్షన్ తో తెలుగు మాట్లాడే హీరో జూనియర్ ఎన్టీఆర్ అని సూర్య కామెంట్లు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తన ఎనర్జీ లెవెల్స్ తో ఇతర ఇండస్ట్రీలను సైతం ఆశ్చర్యపరుస్తున్నారని తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ తెలుగులో మాట్లాడిన విధంగా మరే హీరో మాట్లాడలేరంటూ సూర్య చేసిన కామెంట్లు అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తున్నాయి. సూర్య కామెంట్లకు తారక్ అభిమానులు ఫిదా అవుతున్నారు.
ఇతర ఇండస్ట్రీలలో సైతం అంచనాలను మించి క్రేజ్ ను సొంతం చేసుకుంటున్న తారక్ దేవర సినిమాతో సోలో హీరోగా కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకోగా ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏకంగా 260 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు చెప్పుకోదగ్గ స్థాయిలో రెవిన్యూ వస్తోంది. ఓటీటీలో దేవర స్ట్రీమింగ్ కావడానికి చాలా సమయం పట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న దేవర మూవీ ఓటీటీలో సైతం అదే స్థాయిలో రెస్పాన్స్ ను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు దేవర సీక్వెల్ పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. గత కొన్నేళ్లలో తారక్ మార్కెట్ ఏ రేంజ్ లో పెరిగిందో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. రాబోయే రోజుల్లో తారక్ ట్రిపుల్ హ్యాట్రిక్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.