సినిమా ఇండస్ట్రీలో బోలేడు మంది హీరోలు ఉన్నారు . ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది . అందరికీ పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ ఉండాలి అని లేదు . టైర్ 2 హీరోలు కూడా ఈ మధ్యకాలంలో బాగానే పబ్లిసిటీ దక్కించుకుంటున్నారు . పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిన సినిమా హిట్ అవుతుందా ..? ఫట్ అవుతుందో..? చెప్పలేము కానీ ఈ టైర్ 2 హీరోలు నటించిన సినిమాలు మాత్రం ఖచ్చితంగా యావరేజ్ గా నిలుస్తాయి అని ధీమా వ్యక్తం చేసే రేంజ్ లో ఆ హీరోలు కధలని చూస్ చూసుకుంటున్నారు .


కాగా నేచురల్ స్టార్ నాని ఆ విషయంలో ఎప్పుడు ముందుంటాడు.  పాన్ ఇండియా రేంజ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ఈ హీరో ప్రెసెంట్ ఎలాంటి స్టార్ స్టేటస్ ని అందుకుని ఎంజాయ్ చేస్తున్నాడో మనం చూస్తున్నాం.  రీసెంట్ గా "సరిపోదా శనివారం" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు . అయితే నాని తన  కెరియర్ లో ఎన్నో ఎన్నో సినిమాలో నటించాడు ..ఎంతోమంది హీరోయిన్స్ తో కూడా స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కొన్ని సార్లు లిప్ లాక్ సీన్స్ లో కూడా నటించారు. అయితే కొత్తమంది హీరోయిన్స్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నప్పుడు ఆ సినిమా హిట్ అయ్యాయి . మరి కొంతమందితో స్క్రీన్  చేసుకున్నప్పుడు ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.



అయితే నానికి తెర పై పర్ఫెక్ట్ జోడి ఎవరు అంటే మాత్రం ఖచ్చితంగా కీర్తి సురేష్ అంటున్నారు అభిమానులు.  నాని - నిత్యమీనన్ నటించిన సినిమాలు కూడా బాగుంటాయి.  కానీ నాని - కీర్తి సురేష్ జంట తెరపై చూస్తే అది ఏదో కొత్త ఫీలింగ్ గా ఉంటుంది అని.. నిజంగానే వీళ్ళ కెమిస్ట్రీ అద్దిరిపోతుంది అని ..నానికి లక్కీ హీరోయిన్ అంటే కీర్తి సురేష్ అని చెప్పుకొస్తున్నారు. వీళ్ల కాంబోలో మరో మూవీ రావాలి అని ఆశపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి: