రామ్ చరణ్ ..అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్ . తండ్రి పెద్ద మెగాస్టార్ చిరంజీవి అయినప్పటికీ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉపయోగించుకోకుండా సొంత టాలెంట్ తో పైకి రావాలి అని ఎంత కష్టపడుతున్నాడో చూస్తున్నాం . అయినా సరే కొంతమంది పని పాట లేని బ్యాచ్ ఆయన మెగాస్టార్ స్టార్ డమ్ ని ఉపయోగించుకుని ఇండస్ట్రీలోకి వచ్చాడు అంటూ నానా రకాలుగా స్పందిస్తూ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ..గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు.


ఆ తర్వాత సుకుమార్ తో ఒక సినిమాని సెట్స్ పై కి తీసుకురాబోతున్నాడు . ఆలోపే బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కే సినిమాను ఫినిష్ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు . కాగా ఇలాంటి మూమెంట్లోనే రాంచరణ్ కి సంబంధించిన ఒక సెన్సేషనల్ న్యూస్  మీడియాలో హాట్ హాట్ గా ట్రెండ్ అవుతుంది . గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న రాంచరణ్ ఓ స్టార్ డైరెక్టర్ నెంబర్ ని బ్లాక్ చేశాడు అన్న వార్త అభిమానులకి మింగుడు పడడం లేదు .



డైరెక్టర్ మరెవరో కాదు "కొరటాల శివ". రామ్ చరణ్ - చిరంజీవి - పూజ హెగ్డే కాంబోలో వచ్చిన సినిమా "ఆచార్య". ఈ సినిమాపై హ్యూజ్  ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని ఉన్నారు మెగా అభిమానులు . కానీ కొరటాల శివ అది మొత్తం ఉల్టా చేసేసాడు . కనీసం సామాన్య జనాలకి కూడా ఈ సినిమా నచ్చలేదు.  దీంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది . ఆ మూమెంట్లో అందరూ ఆచార్య సినిమా ప్లాప్ అవ్వడానికి కారణం కొరటాల శివ అని అన్నారు.



అయితే కొన్ని ఇంటర్వ్యూస్ లో కొరటాల శివ పరోక్షకంగా మెగా హీరోస్ దే తప్పు అనే విధంగా మాట్లాడారు. ఈ సినిమాకి డబ్బులు పెట్టుకున్న డిస్ట్రీబ్యూట్రస్  కూడా చాలా చాలా నష్టపోయారు. అది కూడా పెద్ద రాద్ధాంతమైంది . అదే మూమెంట్లో కొరటాల శివ టంగ్ స్లిప్ అవుతూ తన ఫ్రెండ్స్ వద్ద చరణ్ హీరో మెటీరియల్ కాదు అంటూ ఆయన కి ఆ సీన్ లేదు అంటూ చెప్పుకొచ్చారట . ఆ మాటలు రాంచరణ్ చెవిన పడ్డాయి. దీంతో కోపంతో నెంబర్ బ్లాక్ చేశాడట . ఇక ఆయనతో సినిమా ఓకే చేసే ప్రసక్తి లేదు అంటూ అప్పుడే తేల్చి చెప్పేశాడట..!!

మరింత సమాచారం తెలుసుకోండి: