త్రివిక్రమ్ మాట్లాడుతూ.. "ఈ జనరేషన్ యాక్టర్స్‌లో చాలా కొద్ది మంది మాత్రమే టాలెంటెడ్ గా ఉన్నారు వారిలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ ఉన్నారు. వాళ్ళిద్దరినీ ఒకేసారి చూడటం సంతోషం అనిపిస్తోంది. మామూలుగా ప్రేక్షకులు సినిమా చూసేటప్పుడు అందులో కథానాయకుడు నెగ్గుతూ ఉండాలని కోరుకుంటారు. లక్కీ భాస్కర్ మూవీ చూసేటప్పుడు కూడా ప్రేక్షకులు అలానే కోరుకుంటారు. భాస్కర్ లక్కీ అవ్వాలని సినిమా మొత్తం అనుకోకుండా ఉండలేరు. ఫైనల్ గా భాస్కర్ లక్కీగానే బయటకు వస్తాడు. ఈ సినిమా కథకు లక్కీ భాస్కర్ అనే టైటిల్ 100% ఆఫ్ట్‌గా ఉంటుంది. ఇందులోని చిన్న పాత్రలను వెంకీ చాలా బాగా తీర్చిదిద్దాడు. అన్ని పాత్రలు కథను ప్రభావితం చేయడమే ఈ సినిమాలోని గొప్పతనం."
"బ్యాంక్ సెక్యూరిటీ గార్డ్‌తో సహా ప్రతి ఒక్కరూ ప్రేక్షకులను ఎమోషనల్ అయ్యేలా చేస్తారు. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అసలు అతను యాక్టింగ్ చేసినట్లు కనిపించదు. భాస్కర్ అనే ఒక బ్యాంకు క్లర్క్ జీవితాన్ని చూసినట్లుగానే అనిపిస్తుంది. భాస్కర్ మనల్ని చేయి పట్టుకొని తనతో పాటు బ్యాంక్ లోకి తీసుకెళ్లి పోతాడు. దుల్కర్ మమ్మూట్టి లాంటి మర్రిచెట్టు కింద పెరిగాడు, మర్రిచెట్టు కింద మొక్కలు బ్రతకవని అంటారు కానీ దుల్కర్ పెద్ద మహావృక్షంగా ఎదిగాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర నా మనసును తాకింది. ముఖ్యంగా రాంకీ పాత్ర నాకు బాగా నచ్చింది. ఈ సినిమా చూశాక ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక అడ్వెంచర్ చేస్తే అతడు కచ్చితంగా విజయం సాధించాల్సిందే అనే ఒక ఫీలింగ్ మనకి కలుగుతుంది. ఇది మన అందరికీ రిలేటబుల్ స్టోరీ గా ఉంటుంది. అడ్వెంచర్ చేయడం, దాని నుంచి సక్సెస్ ఫుల్ గా బయటపడటం అనేది ప్రతి ఒక్కరి ఆశ. ఆ హోప్ సినిమా చూశాక తీరినట్లుగా అనిపిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తడిసిన కళ్లతో, నవ్వుతున్న పెదాలతో థియేటర్లలోనుంచి బయటకు వస్తారని నేను చెప్పగలను. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను." అని త్రివిక్రమ్ తన స్పీచ్ ముగించాడు.