టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న యువ నటులలో నితిన్ ఒకరు. ఈయన జయం అనేది మూవీతో వెండితెరకు పరిచయం అయ్యాడు. మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కూడా చిన్నా చితక విజయాలను అందుకున్నాడు. అలాంటి సమయంలోనే ఈయన రాజమౌళి దర్శకత్వంలో సై అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఒక్క సారిగా నితిన్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇక ఆ తర్వాత నుండి ఈయన నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర వరుసగా బోల్తా కొడుతూ వచ్చాయి.

అలా చాలా కాలం పాటు ఈయన నటించిన సినిమాలు వరుస ఫ్లాప్ లు అవుతూ రావడంతో ఈయన కెరియర్ కూడా ముగిసింది అని చాలా మంది భావించారు. ఇక అలాంటి సమయం లోనే ఈయన విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఇష్క్ అనే సినిమాలో హీరోగా నటించాడు. నిత్యా మీనన్మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ సినిమాకు ముందు నితిన్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ యు కావడం ఇక విక్రమ్ కే కుమార్ కూడా ఈ మూవీ కి ముందు భారీ స్థాయి క్రేజ్ లేకపోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు పెద్దగా అంచనాలు పెట్టుకోలేదు.

అలా ఏ మాత్రం అంచనాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ వచ్చింది  దానితో ఈ మూవీ కి కలెక్షన్లు విపరీతంగా రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. దానితో ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఈ మూవీ తో నితిన్ కి మళ్ళీ ఫుల్ క్రేజ్ వచ్చింది. అలా ఆల్మోస్ట్ ముగిసింది అనుకున్న నితిన్ కెరియర్ కు ఇష్క్ మూవీ మంచి జోష్ ను నింపింది. అలాగే చిన్న సినిమాగా వచ్చి ఈ మూవీ పెద్ద విజయం అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: