ఇక అది 2001 సంవత్సరం ఉదయ్ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను విడుదలైన రోజు హైదరాబాదులోని సుదర్శన్ థియేటర్లో డైరెక్టర్ తేజ ప్రేక్షకులతో కలిసి ఈ సినిమాను చూస్తున్నాడు.. ఇక ఇంటర్వెల్ సమయంలో ఆయన కన్ను ఓ టీనేజ్ అబ్బాయి పై పడింది. అతడు దగ్గరికి వెళ్లి పరిచయం చేసుకున్నాడు.. నీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా?  అని కూడా అడిగాడు. అతను నాకు యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని చెప్పడంతో అతని ఫోన్ నెంబర్ కూడా తీసుకుని.. అవసరమైనప్పుడు పిలుస్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ కుర్రాడు మరెవరో కాదు టాలీవుడ్ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి కొడుకు  నితిన్ అని ఆ తర్వాత తేజకు తెలిసింది. పైగా నువ్వు నేను సినిమాకి సుధాకర్ రెడ్డి నైజం డిస్ట్రిబ్యూటర్ గా ఉన్నారు.


‘నువ్వు నేను’ బ్లాక్‌ బస్టర్ హిట్ కావడంతో తేజకు డిమాండ్ పెరిగిపోయింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన కుమారుడు అల్లు అర్జున్‌ని లాంచ్ చేయాలని ఆఫర్ ఇచ్చారు. దీంతో తేజ ఓ స్క్రిప్ట్ రెడీ చేసి అల్లు అర్జున్‌పై టెస్ట్ షూట్ సెట్ అవలేదు. దీంతో తన తర్వాత సినిమా సినిమా చేస్తానని చెప్పి అల్లు అరవింద్ కు సారీ చెప్పి వెళ్ళిపోయాడు.. ఎంతమందికి స్క్రీన్ టెస్ట్ చేసినా సెట్ కాకపోవడంతో చివరికి నితిన్‌కి కాల్ చేశాడు.  ఆ ఫోటో షూట్ లో తాను అనుకున్నట్లుగా లేకపోవడంతో తను థియేటర్లో చూసిన నితిన్ ఓకే చేశాడు.. ముందుగా ముంబాయి కోఆర్డినేటర్ ద్వారా సదాని హీరోయిన్గా ఓకే చేశాడు.  హీరోగా ముంబయికి చెందిన ఓ నటుడిని తీసుకుని కొన్ని సీన్లు షూట్ చేశాక తేజకు నచ్చలేదు. దీంతో వెంటనే గోపీచంద్‌కు ఫోన్ చేయగా అతడు హీరో వేషమనుకుని రెక్కలు కట్టుకుని వచ్చేశాడు. తీరా అక్కడికి వెళ్లాక విలన్ పాత్ర అని తెలుసుకుని షాకయ్యాడు. అయితే తేజ మీద నమ్మకంగా కాసేపు ఆలోచించుకుని ఓకే చెప్పేశాడు గోపీచంద్. అయితే అమ్మతో పాటు చాలామంది స్నేహితులు, సన్నిహితులు విలన్ క్యారెక్టర్ చేయొద్దని చెప్పినా తనకు తేజపై నమ్మకముందని గోపీచంద్ చెప్పాడంట.


ఓ సన్నివేశంలో హీరోయిన్ ఏడ్వాలి. అయితే అక్కడ సదా గ్లిజరిన్ పెట్టుకున్నప్పటికీ కన్నీళ్లు సరిగా రాకపోవటంతో తేజ ఆమెను కావాలని చెంపపై కొట్టాడట. దీంతో ఆమె ఏడుపు మొహం పెట్టుకోగా దాన్నే సీన్‌గా తీసేశాడట. ఇలా కేవలం 65 రోజుల్లోనే రూ.1.80కోట్ల బడ్జెట్‌తో ‘జయం’ సినిమా తెరకెక్కింది. కథ పాతదే అన్న విమర్శ వచ్చినప్పటికీ తేజ టేకింగ్, నితిన్, సదా, గోపీచంద్ నటగ ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో హీరోని చూసి సదా చెప్పిన ‘వెళ్లవయ్యా వెళ్లు.. వెళ్లూ..’ అంటూ డైలాగ్ బాగా ఫేమస్ అయింది. ఆర్పీ పట్నాయక్ సంగీతం సినిమాను మరో మెట్టుకు తీసుకెళ్లింది. అలాగే ఈ సినిమాతో దాదాపు 30 మందికి పైకి కొత్త ఆర్టిస్టులు టాలీవుడ్కు పరిచయమయ్యారు. వీరిలో ఒకరైన సుమన్ శెట్టి తొలి సినిమాతోనే ఆకట్టుకుని ఎన్నో అవకాశాలు దక్కించుకున్నాడు. అలాగే ఈ సినిమా 58 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా అ త‌ర్వాత‌ నాలుగు వారాల్లో 150 ప్రింట్లకు వెళ్ళింది.  70 సెంటర్లలో 100 రోజులు ఆడింది. అలాగే 1.80 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా లాంగ్ రాన్లో దాదాపు 30 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టండి. అలాగే నితిన్ కు బెస్ట్ డబ్ల్యూ హీరోగా, హీరోయిన్గా సదాకు ఫిలింఫేర్ అవార్డులు కూడా వచ్చాయి. అలాగే బెస్ట్ విలన్ గా కూడా గోపీచంద్ కు నంది అవార్డు దక్కింది. విలన్‌ పాత్ర చేయొద్దని చెప్పినవాళ్లే.. ఆ పాత్రను నువ్వు తప్ప ఇంకెవరూ చేయలేరంటూ గోపీచంద్‌ను ప్రశంసలతో ముంచెత్తడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: