స్టార్ హీరో హీరోయిన్లు నటించి.. భారీ బడ్జెట్ తో రూపొంది.. స్టార్ దర్శకుడు టేకింగ్ లో తెరకెక్కిన సినిమాలకు ఒకప్పుడు భారీ డిమాండ్ ఉండేది. కానీ ఇప్పుడు స్టార్ హీరోలకు కాదు కేవలం కథలకు మాత్రమే టాలీవుడ్ ఇండస్ట్రీలో డిమాండ్ ఏర్పడింది. దీంతో మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే చాలు స్టార్ హీరోలు లేకపోయినా భారీ బడ్జెట్ పెట్టకపోయినా బ్లాక్బస్టర్ హిట్టు కొట్టొచ్చు. ఇండస్ట్రీ సైతం షాక్ అయ్యే విజయాన్ని సాధించవచ్చు అని ఇప్పటివరకు ఎన్నో సినిమాలు నిరూపించాయి.


 ఇక ఈ మధ్యకాలంలో అయితే అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చి చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. ఎలాంటి అంచనాల లేకుండా చిన్న సినిమాగా విడుదలై ఇక ప్రేక్షకుల మనసులు దోచేసి బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాలు సాధించిన మూవీస్ టాలీవుడ్ లో చాలానే ఉండగా అలాంటి సినిమాలలో ఒకటి జాతి రత్నాలు. నవీన్ పోలిశెట్టి అనే అంతంత మాత్రం తెలిసిన హీరో.. ఇకప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని డైరెక్టర్ అనుదీప్. వీరిద్దరి కాంబినేషన్లో జాతి రత్నాలు సినిమా వచ్చింది.

 ఇలాంటి చిన్న సినిమాలు చాలానే వస్తుంటాయిలే అని ప్రేక్షకులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఈ మూవీ విడుదలైన తర్వాత మాత్రం సెన్సేషన్ విజయం సాధించింది. ఏదో టైం పాస్ కిఈ మూవీకి వెళ్లిన ప్రేక్షకులు..ఆ మూవీలో ఉన్న కిక్కు చూసి తెగ సంబరపడిపోయారు. ఇంకేముంది మీరు కూడా ఈ మూవీకి వెళ్ళండి ఫుల్ ఎంటర్టైన్మెంట్ పక్కన అంటూ స్నేహితులకు కూడా ప్రమోట్ చేసారు. ఇలా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి ఇక భారీ విజయాన్ని సాధించింది. ఏకంగా 100 కోట్ల వసూళ్లు సాధించి సెన్సేషన్స్ సృష్టించింది. ఇక డైరెక్టర్ అనుదీప్ స్టార్ డైరెక్టర్ల లిస్టులో చేర్చిన ఈ మూవీ.. అటు నవీన్ పోలిశెట్టి కెరియర్ను ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇక ఇప్పుడు ఈ సినిమా వచ్చిన కూడా అందరూ కూడా టీవీలకు అతుక్కుపోయి మరి చూస్తూ ఉంటారు. అంతలా రియలిస్టిక్ కథతో ఈ సినిమా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: