2024 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా గుంటూరు కారం, హనుమాన్ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. గుంటూరు కారం మూవీ మెజారిటీ థియేటర్లలో విడుదల కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీకి పరిమిత సంఖ్యలో స్క్రీన్లు దక్కాయి. సింగిల్ స్కీన్ల విషయంలో హనుమాన్ మూవీకి ఎదురైన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. థియేటర్ల విషయంలో నిర్మాతలు సైతం ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.
 
హనుమాన్ మూవీ 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కగా ఈ సినిమాకు ఏకంగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది. అయితే ఒక చిన్న సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లను సాధించడం గతంలో ఎప్పుడూ జరగలేదు. తేజ సజ్జా ప్రశాంత్ వర్మ హనుమాన్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఒకింత సంచలనం సృష్టించారనే చెప్పాలి. హనుమాన్ సీక్వెల్ జై హనుమాన్ పై అంచనాలు పెరిగాయి.
 
హనుమాన్ సాధించిన సంచలనాల గురించి మరో పదేళ్ల పాటు మాట్లాడుకుంటామని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని చెప్పవచ్చు. జై హనుమాన్ మూవీ 2026 సంవత్సరంలో థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి. జై హనుమాన్ సినిమాలో రిషబ్ శెట్టి నటించనున్నారని సమాచారం అందుతోంది.
 
హనుమాన్ సినిమా న భూతో న భవిష్యత్ అనే విధంగా కలెక్షన్లను సాధిస్తుండటం గమనార్హం. చిన్న సినిమాలలో పెద్ద విజయం సాధించిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. జై హనుమాన్ మూవీ సైతం కలెక్షన్ల పరంగా సంచలన విజయాన్ని సొంతం చేసుకునే అవకాశం ఉంది. రిషబ్ శెట్టి నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. హనుమాన్ సినిమాకు వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో రాబోయే రోజుల్లో మైథలాజికల్ కాన్సెప్ట్ తో మరిన్ని సినిమాలు తెరకెక్కనున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: